World cup 2023: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్ తింటారా?
అఫ్ఘాన్‌పై ఓటమిని తట్టుకోలేకపోతున్నారు పాక్ మాజీ ఆటగాళ్లు. తమ జట్టు ప్లేయర్ల ఫిట్నెస్ ఏ మాత్రం బాలేదని పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్ విమర్శించాడు. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్కిల్స్ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉందంటూ కామెంట్స్ చేశారు. వారి ఫిట్నెస్ లెవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అసలు ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం.