Donald Trump: శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఆమెకు  ట్రంప్‌ సీక్రెట్‌ మెసేజ్‌!

అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీకి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్‌ పామ్‌ బోండీకి సూచిస్తూ ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. అయితే ఆయన పోస్టుపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

New Update
Trump's letter to the Attorney General

Trump's letter to the Attorney General

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) తీసుకునే ప్రతి నిర్ణయం ఈ మధ్య వివాదస్పదమవుతోంది. ఈ మధ్య ఆయన వివిధ దేశాల పై విధించిన సుంకాల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మనదేశంపై విధించిన సుంకాల విషయంలో ప్రధానితో పాటు భారతదేశ పౌరులంతా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగానే అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ కి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్‌ అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ సూచిస్తూ ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. అయితే ఆయన పోస్టుపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. బోండీకి ట్రంప్‌ వ్యక్తిగతంగా మెసేజ్‌ పెట్టబోయి.. బహిరంగంగా పోస్టు పెట్టాడేమో అంటూ  నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Early Morning: ఉదయం తినకుండా ఎక్కువ సేపు ఆకలితో ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Take Revenge On Enemies - Trump

అయితే ఈ విషయమై అసలేం జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెలుగుచూసింది. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పామ్‌ బోండీతో ట్రంప్‌ పేర్కొన్నట్లు ఈ పోస్ట్‌ తెలుపుతోంది. ‘మనం ఇక ఆలస్యం చేయలేము. ఇది మన కీర్తి, విశ్వసనీయతను చంపేస్తుంది. వారు నన్ను రెండుసార్లు అభిశంసించారు. అభియోగాలు మోపారు. న్యాయం జరగాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన తన పోస్ట్‌ లో రాసుకొచ్చారు. మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ సెనెటర్‌ ఆడమ్‌ షిప్‌, న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటిటియా జేమ్స్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.వీరితో కొంతకాలం నుంచి ట్రంప్‌కు వైరం నడుస్తోంది. ఈ క్రమంలో వారిపై చర్యలను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పోస్టు పెట్టినట్లుగా తెలుస్తోంది.

కాగా, ట్రంప్‌ పోస్టు సోషల్‌ మీడియా(Social Media) లో వైరల్‌ మారింది. బోండీకి వ్యక్తిగతంగా మెసేజ్‌ పెట్టబోయి.. ఆయన ఆన్‌లైన్‌లో పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీని గురించి అమెరికా అధికారులు స్పందించలేదు. మరోవైపు బోండీని ప్రశంసిస్తూ ట్రంప్‌ మరో పోస్టు కూడా పెట్టారు. యూఎస్ అటార్నీ జనరల్‌గా ఆమె అద్భుతంగా పనిచేస్తోందంటూ ఆకాశానికెత్తారు. కానీ, తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు వర్జీనియాలోని లిండ్సే హాలిగాన్ (Lindsey Halligan) వంటి ప్రాసిక్యూటర్‌ అవసరమని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఆమెను యూఎస్‌ అటార్నీగా నామినేట్ చేస్తానని ట్రంప్‌ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు లిండ్సే అందరికీ సమాన న్యాయం చేస్తారని వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చూడండి: Health Tips: ఈ హెల్తీ జ్యూస్‌ను ఆ సమయంలో తాగుతున్నారా.. ఇక మీ ప్రాణాలు కాపాడటం దేవుడి వల్ల కాదు

Advertisment
తాజా కథనాలు