Health Tips: ఈ హెల్తీ జ్యూస్‌ను ఆ సమయంలో తాగుతున్నారా.. ఇక మీ ప్రాణాలు కాపాడటం దేవుడి వల్ల కాదు

పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే  మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మొత్తంలో జ్యూస్ తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, చిరాకు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Early Morning Tips

Early Morning Tips

బీట్‌రూట్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలని కొందరు బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటారు. ముఖ్యంగా రోజూ ఉదయం పరగడుపున ఈ జ్యూస్‌ను తాగుతారు. ఇందులో విటమిన్లు, ఇనుము, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని  పెంచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువగా శాతం మంది ఈ జ్యూస్‌ను పరగడుపున మితం కంటే ఎక్కువగా తీసుకుంటారు. మరి పరగడుపున బీట్  రూట్ జ్యూస్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి:  Early Morning: ఉదయాన్నే ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే తస్మాత్ జాగ్రత్త

మితంగా మాత్రమే తీసుకోవాలని..

పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే  మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మొత్తంలో జ్యూస్ తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, చిరాకు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డైలీ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగాలని అనుకుంటే టిఫిన్ చేయడానికి ఒక పది నిమిషాల ముందు లేదా టిఫిన్ చేసిన తర్వాత తాగడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొందరు ఇందులో నిమ్మరసం వంటివి మిక్స్ చేస్తారు. వీటివల్ల అసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అదే టిఫిన్ తర్వాత తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు  చెబుతున్నారు. 

బీట్ రూట్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

డైలీ బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు బాడీకి ఎనర్జీ అందుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం తర్వాత బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలు  రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం వైద్యుని సూచనల మేరకు మాత్రమే బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు