/rtv/media/media_files/2025/09/20/early-morning-2025-09-20-07-50-21.jpg)
Early Morning
చాలా మంది ఉదయం పూట ఎక్కువ సమయం ఆకలితో ఉంటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, నీరసం, అలసట వంటి సమస్యలు వస్తుంటాయి. ఉదయం సమయంలో ఆకలితో ఎక్కువ సమయం అసలు ఉండకూడదు. తప్పకుండా లేచిన గంటలోగా అయినా కనీసం ఏదో ఒకటి తినాలి. బ్రష్ చేసిన వెంటనే మొదటిగా వేడి నీరు తాగాలి. ఆ తర్వాత లైట్ ఫుడ్ అయినా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాత్రంతా నిద్రపోయి ఉంటారు. దాదాపుగా 8 నుంచి 9 గంటల వరకు బాడీకి ఎలాంటి ఫుడ్ అందదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఎక్కువ సమయం ఉదయం పూట తినకపోతే ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
అలసటఅలాగ
ఉదయాన్నే మన శరీరానికి చాలా శక్తి కావాలి. అల్పాహారం తీసుకోకపోతే, రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల శరీరం నిస్సత్తువగా, బలహీనంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా శక్తి సరిపోదు, త్వరగా అలసిపోతాం. రోజంతా చురుకుగా ఉండాలంటే అల్పాహారం తప్పనిసరి.
ఏకాగ్రత తగ్గుతుంది
మన మెదడు సరిగా పనిచేయడానికి గ్లూకోజ్ చాలా అవసరం. అల్పాహారం తినకపోతే, మెదడుకు కావాల్సిన శక్తి అందదు. దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది. పనులపై అసలు దృష్టి పెట్టలేము. రోజంతా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువుపై, ఉద్యోగులు ఆఫీసు పనులపై దృష్టి పెట్టలేరు. దీనివల్ల ఎక్కువగా సమస్యల్లో ఇరుక్కుంటారు.
బరువు పెరుగుతారు
ఉదయం ఎక్కువ సేపు ఆకలితో ఉంటే, మధ్యాహ్నం భోజనం సమయంలో ఎక్కువగా తినేస్తారు. అప్పటివరకు ఆకలితో ఉండటం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అదే ఉదయం పూట అల్పాహారం తీసుకుంటే జీవక్రియ మెరుగై బరువు అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పోషకాల లోపం
అల్పాహారం తినకపోతే, శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందవు. ముఖ్యంగా, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, పీచు పదార్థాలు (ఫైబర్) లోపిస్తాయి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బలం తగ్గిపోయి త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
జీర్ణ సమస్యలు వస్తాయి
ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండటం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల కడుపులో నొప్పి, అజీర్ణం, వికారం వంటి ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇది దీర్ఘకాలంలో కడుపులో పుండ్లకు కూడా దారితీస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.