Swedish Company: ఆ పని కోసం 30 నిమిషాల విరామం.. ఆ కంపెనీలో ఉద్యోగస్తులకు బంపరాఫర్

ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే స్వీడిష్ అడల్ట్ ఫిల్మ్ కంపెనీ తమ సిబ్బందికి 30 నిమిషాల హస్త ప్రయోగం విరామం ఇస్తుంది. ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించి, ఉత్పాదకతను పెంచడం దీని లక్ష్యం. దీనికోసం ప్రత్యేకంగా ఆఫీసులోనే ‘మాస్టర్బేషన్ స్టేషన్’ అనే రూమ్‌ను ఏర్పాటు చేశారు.

New Update
Swedish company gives 30-minute masturbation break to its staff

సాధారణంగా ఒక్కో కంపెనీలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం మధ్యాహ్నం సమయంలో నిద్రపోయే సమయాన్ని కేటాయిస్తాయి. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు రిలాక్స్ కావడానికి కొన్ని గేమ్స్ ఏర్పాటు చేస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ఎవరూ ఊహించని రూల్ పెట్టింది. 

Also Read :  కొంపముంచిన డేటింగ్ యాప్.. 11 లక్షల మంది మహిళల ప్రైవేట్‌ చాట్స్ లీక్‌

Masturbation Break

ఓ కంపెనీ తమ ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ‘‘30నిమిషాలు హస్త ప్రయోగం విరామం’’ అనే విధానం తీసుకొచ్చింది. ఎరికా లస్ట్ ఫిల్మ్స్ (Erika Lust Films) అనే స్వీడిష్ అడల్ట్ ఫిల్మ్ కంపెనీ తమ ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే స్వీడిష్ అడల్ట్ ఫిల్మ్ కంపెనీ యజమాని ఎరికా లస్ట్ ఈ విధానం గురించి పూర్తిగా వివరించారు. స్టాక్‌హోమ్‌కు చెందిన ఈ కంపెనీలో 40 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2021 ఏడాదిలో కోవిడ్ 19 సమయంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారు. దీంతో మహమ్మారి సిబ్బందిని మానసికంగా ప్రభావితం చేసింది. అప్పుడే సిబ్బంది శ్రేయస్సును మెరుగుపరచడానికి, పనిలో మరింత ఫోకస్ పెట్టడానికి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. 

ఆ సమయంలోనే ఉద్యోగులు ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడటానికి ‘హస్త ప్రయోగం విరామం’ అనే ఒక ఆలోచన ఎరికా లస్ట్‌కు వచ్చింది. దీంతో తమ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని, మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉంటారని ఆమె పూర్తిగా నమ్మారు. ఇందులో భాగంగానే ఆమె ఈ విధానాన్ని మొదట ఒక ట్రయల్‌గా ప్రారంభించారు. 

దీనిని సౌకర్యవంతంగా మార్చడానికి ఆమె ఆఫీసులోనే ‘మాస్టర్బేషన్ స్టేషన్’ అనే ఒక ప్రత్యేక రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ గదిలో ఉద్యోగులు ఏకంతంగా.. ప్రశాంతంగా తమ విరామాన్ని ఉపయోగించుకోవచ్చు. 

దీనిపై ఎరికా లస్ట్ మాట్లాడుతూ.. ఈ విధానం ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అంతేకాకుండా ఇది వారికి సంతోషాన్ని, అలాగే విశ్రాంతిని అందిస్తుందని కూడా పేర్కొన్నారు. పనిలో మరింత ఫోకస్ పెట్టడానికి, ఇంకాస్త ఎక్కువగా ఆలోచించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని ఆమె చెప్పుకొచ్చారు. 

Also Read :  చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?

Viral News | international news in telugu | latest-telugu-news | telugu-news | Swedish Company

Advertisment
తాజా కథనాలు