/rtv/media/media_files/2025/07/29/tea-dating-app-2025-07-29-13-53-01.jpg)
Tea dating app also exposed private chats of 11 lakhs women, Report
ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ యువకులు డేటింగ్ యాప్‌లు వాడుతున్నారు. కొత్త వాళ్లని పరిచయం చేసుకుంటూ వాళ్లతో స్నేహం చేస్తున్నారు. నచ్చితే వాళ్లతో వివాహ బంధంలోకి కూడా అడుగుపెడుతున్నారు. అయితే ఓ డేటింగ్ యాప్ వల్ల లక్షలాది మంది మహిళలు మోసపోయిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.'టీ' అనే డేటింగ్ యాప్‌లో 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేటు మెసేజ్‌లు ఆన్‌లైన్‌లో బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అందులో అత్యంత సున్నితమైన, వ్యక్తిగత సమాచారం ఉందని స్పష్టం చేసింది.
Also Read : ఆ పని కోసం 30 నిమిషాల విరామం.. ఆ కంపెనీలో ఉద్యోగస్తులకు బంపరాఫర్
Dating Apps Exposed Private Chats
మహిళలకు తమ యాప్ వాడితే భద్రత ఉంటుందని టీ నిర్వాహకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయినాకూడా వరుసగా డేటా అనేది బయటకు వెళ్లడం ఆందోళన కలగిస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితమే వేలాది మంది యూజర్ల సెల్ఫీలు, ఐడీ ఫొటోలు ఆన్‌లైన్‌లో బయటపడ్డాయి. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు మీడియాకు చెప్పారు. తాజాగా టీ డేటింగ్ యాప్‌లో 2023 నుంచి ఉన్న ప్రైవేటు మెసేజ్‌లు లీక్ అయ్యాయి. ఇందులో కొందరు మహిళలు వాళ్ల అబార్షన్‌కు సంబంధించినవి, అలాగే రిలేషన్‌షిప్‌కు సంబంధించినవి చర్చించుకున్నారు. ఈ యాప్‌లో ఫేక్ పేర్లు వాడే వెసులుబాటు కూడా ఉంది. కానీ చాలామంది యూజర్లు తమ గుర్తింపు ఉన్న వివరాలతోనే ఐడీని వాడుకున్నారు.
తమ చేసే ప్రైవేటు మెసేజ్‌లు రహస్యంగా ఉంటాయని వాళ్లు భావించారు. కానీ ఈ మెసేజ్‌లు లీక్ అవ్వడం తీవ్ర ఆందోళలకు దారితీసింది. దీంతో ఈ యాప్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే టీ యాప్‌లో 16 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఇది కేవలం మహిళలది మాత్రమే. వాళ్లు మాత్రమే ఈ యాప్‌లో చేరేలా సెల్ఫీలతో కూడా నిర్ధరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన ఫీచర్ ఉండటం వల్లే చాలామంది మహిళలకు దీనికి ఆకర్షితులయ్యారు.
అయితే వరుసగా ఈ యాప్‌లో ఉల్లంఘనలు జరగడం వల్ల డేటా భద్రత సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక చివరికి ఈ వ్యవహారంపై టీ నిర్వాహకులు కూడా స్పందించారు. ఇలాంటి ఘటనకు పునరావృతం కాకుండా ఉండేందుకు తగినన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించామని తెలిపారు. అంతేకాదు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో దీనిపై విచారణ కూడా జరిపిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా భద్రతా సంస్థలు జరిపే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. టీ డేటింగ్ యాప్ ప్రైవేట్ చాట్స్ లీక్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి యాప్‌లు వాడటం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
Also Read: చెస్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?
rtv-news | telugu-news | international news in telugu | latest-telugu-news | dating-app | today-news-in-telugu