/rtv/media/media_files/2025/06/26/ax-4-mission-2025-06-26-13-09-58.jpg)
Subhanshu Shukla: ఆక్సియం మిషన్ 4(Axiom 4 mission)లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాన్షు శుక్లా తన మొదటి సందేశాన్ని పంపారు. ఆక్సియమ్ మిషన్ 4 సమయంలో తన అనుభవ వివరాలను ఆయన పంచుకున్నారు. ISSలో 14 రోజుల యాత్ర కోసం ఆయన బుధవారం మధ్యాహ్నం ఫ్లోరిడాలోని కెన్నడి స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. 24 గంటల ఆయన అంతరిక్ష ప్రయాణం ఎలా ఉందనే దాని గురించి ఓ వీడియో సందేశాన్ని ఆయన భూమి మీదకు పంపారు. అంతరిక్షంలోకి వెళ్లాక ఆరోగ్యం బాగోలేదని, తాను చాలాసేపు నిద్రపోతున్నానని శుభాన్షు శుక్లా తెలిపారు. అంతరిక్షంలో నడవడం, తినడం నేర్చుకుంటున్నానని ఆయన వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమయం గడపడం, తన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం పట్ల శుభాన్షు శుక్లా ఉత్సాహం వ్యక్తం చేశారు.
Ax-4 Mission | In-Flight Update https://t.co/Lqu0QiGGrA
— Axiom Space (@Axiom_Space) June 26, 2025
శుభాన్షు శుక్లా తనతోపాటు ఓ హంస బోమ్మను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఆయన తోటి వ్యోమగాములతో అంతరిక్షంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయాణాన్ని చాలా ఉత్కంఠభరితంగా ఉందని అభివర్ణించారు. ఇది భారతీయ సంస్కృతిలో హంస జ్ఞానానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. అందుకే ఆయనతోపాటు ఓ మొత్తటి హంస బొమ్మను తీసుకువచ్చానని పేర్కొన్నారు. జూన్ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఇండియన్ ఆస్ట్రోనాట్ ప్రయాణం ప్రారంభమైంది.
Follow Us