Russia-Ukraine War: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 22 మంది మృతి

సోమవారం అర్ధరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 80 మంది గాయపడ్డారని వెల్లడించారు.

New Update
Strikes overnight on Ukraine kill 22, says Zelenskyy, as Trump sets new Russia deadline

Strikes overnight on Ukraine kill 22, says Zelenskyy, as Trump sets new Russia deadline

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించడం లేదు. ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 85 మంది గాయపడ్డారని వెల్లడించారు.  

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని జపోర్జియా అనే ప్రాంతంలో ఉన్న జైలుపై రష్యా దాడి చేసింది. బిలెన్‌కివ్స్కాలోని మరో కాలనీపై కూడా దాడులు చేసింది. ఈ దుర్ఘటనలో 25 మంది మృతి చెందారు. మరో 85 మంది క్షతగాత్రులయ్యారు. 42 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలయ్యాయి ఈ దాడిలో జైలు డైనింగ్‌ హాలు, క్వారంటైన్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓ మూడంతస్తుల భవనం కూడా దెబ్బతింది. అలాగే పలు ఆస్పత్రుల్లో కూడా వైద్య సదుపాయాలు నాశనమయ్యాయి. అయితే ఈ దాడులు జరిగాకా మిగిలిన ఖైదీలు ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని అధికారులు చెప్పారు.

Also Read: ఆ పని కోసం 30 నిమిషాల విరామం.. ఆ కంపెనీలో ఉద్యోగస్తులకు బంపరాఫర్

Russia-Ukraine War

రష్యా చేసిన ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులు ఉండే జైళ్లను టార్గెట్ చేసి ఇలా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తెలిపారు. అలాగే రష్యా ప్రయోగించిన డ్రోన్‌ దాడుల్లో 32 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. ఇదిలాఉండగా  గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఇటీవల దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి. అయితే రష్యా ఉక్రెయిన్‌ మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  

Also Read: కొంపముంచిన డేటింగ్ యాప్.. 11 లక్షల మంది మహిళల ప్రైవేట్‌ చాట్స్ లీక్‌

ఇందులో భాగంగా రష్యా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు రావాలని ఇటీవల పుతిన్‌కు 50 రోజుల గడువు విధించారు. తాజాగా ఆ గడువును కూడా కుదించేశారు. రాబోయే 10-12 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. లేకపోతే రష్యాపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాతో పాటు ఇతర దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా శాంతి ఒప్పందానికి రాకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా సమర్థించారు. తాము ఈ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని.. అమెరికాతో కలిసి పనియాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

rtv-news | telugu-news | Russia-Ukraine War | Donald Trump | latest-telugu-news | international news in telugu

Advertisment
తాజా కథనాలు