/rtv/media/media_files/2025/12/25/increase-population-2025-12-25-07-00-03.jpg)
పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు డేటింగ్(dating)కి వెళ్తే రూ.30వేలు ఇస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి 30లక్షల వరకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది(bumper-offer). ఇదొక్కటే కాదు ఇలాంటి బంపరాఫర్లు చాలా దేశాలు ఇస్తున్నాయి. దీనికి కారణం ఆయా దేశాల్లో యువత పెళ్లి, పిల్లలపై ఆసక్తి చూపకపోవడం. అత్యంత వేగంగా పడిపోతున్న జననాల రేటును అరికట్టడానికి దక్షిణ కొరియా(south-korea) ప్రభుత్వం వినూత్న పథకాలు అమలు చేస్తోంది. దీని ప్రకారం యువత డేటింగ్‌కు వెళ్లినా, పెళ్లి చేసుకున్నా, చివరికి పిల్లలను(increase population) కన్నా ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. జపాన్, ఇటలీ, చైనా, రష్యా, హంగేరీ దేశాల్లో కూడా జనాభా పెంచడానికి అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి.
Also Read : ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేట్.. అదరగొట్టిన ఇండియన్ స్టూడెంట్
ఇండియా పరిస్థితి
మన దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందించే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యత తగ్గుతుందనేది ఆయన అభిప్రాయం. ప్రస్తుతం మన జనాభా 140 కోట్లు కాగా.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య చాలా తగ్గింది. యువత పెళ్లి వైపు మొగ్గుచూపడంలేదు. అంతేకాదు మారిన లైఫ్ స్టైల్, తినే తిండి కారణంగా పెళ్లైన వారికి సంతానం కూడా అంత సులభంగా అందడం లేదు. బహుశా కొన్నేళ్లు పోతే భారత దేశం కూడా జనాభా తగ్గుదల సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందేమో. అప్పుడుమన దేశంలో కూడా ఇలాంటి పథకాలు పుట్టుకొస్తాయి.
ప్రేమలో పడండి.. లక్షలు సంపాదించండి!
దక్షిణ కొరియాలోని బుసాన్ వంటి నగరాల్లో ప్రభుత్వం యువతను ప్రేమ వైపు మళ్లించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. యువత ఒంటరిగా ఉండటాన్ని తగ్గించి, వారిలో సామాజిక సంబంధాలను పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఎవరైనా యువకుడు, యువతి కలిసి డేటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటే, ప్రభుత్వం వారి ఖర్చుల కోసం సుమారు రూ.31,000 ($350 - $500 మధ్య) ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ డబ్బుతో వారు కలిసి భోజనం చేయడం, సినిమా చూడటం లేదా విహారయాత్రలకు వెళ్ళవచ్చు.
పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షలు:డేటింగ్ విజయవంతమై, ఆ జంట వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటే ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. పెళ్లి ఖర్చుల కోసం, గృహ వసతి కోసం సుమారు రూ.25 లక్షల నుండి రూ.31 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాన్ని జంటలకు అందజేస్తున్నారు. పెళ్లికి ముందు ఇరు కుటుంబాల వారు కలుసుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది. ఇందుకోసం ఒక్కో జంటకు అదనంగా నగదు లభిస్తుంది. - telugu viral news
Also Read : బంగ్లాదేశ్‌లో మూతపడ్డ జర్మనీ, అమెరికా ఎంబసీలు
ఎందుకీ ప్రోత్సాహకాలు?
దక్షిణ కొరియాలో జనన రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయికి (0.72) పడిపోయింది. యువత పని ఒత్తిడి, పెరిగిన జీవన ప్రమాణాలు, ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. జనాభా వేగంగా తగ్గిపోతే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఆందోళనతో ప్రభుత్వం ఈ "లవ్ అండ్ మ్యారేజ్" పథకాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. సాధారణంగా ఈ పథకాలను కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో (ఉదాహరణకు సాహా జిల్లా, బుసాన్) పైలట్ ప్రాజెక్టులుగా నిర్వహిస్తున్నారు. దీనికి 24 నుండి 43 ఏళ్ల లోపు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన వారికి ఈ సౌకర్యాలు కల్పిస్తారు.
Follow Us