Bangladesh: బంగ్లాదేశ్‌‌లో మూతపడ్డ జర్మనీ, అమెరికా ఎంబసీలు

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజున) బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి.

New Update
German and US embassies

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజున) బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ దేశంలోని బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అనే ఇస్లామిక్ పార్టీ ఆద్వర్యంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూవులు, క్రైస్తవులు మైనార్టీలుగా ఉన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని ఇండియన్ ఎంబసీ దగ్గర పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే అమెరికా, జర్మనీ దేశాలు రేపు ఎంబసీ మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు!

డిసెంబర్ 25న ఏం జరగబోతోంది?

బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ మతపరమైన ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదు. ప్రత్యేకించి, అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ విడుదల కోరుతూ గిరిజన, మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీనికి వ్యతిరేకంగా కొన్ని తీవ్రవాద, ఇతర అతివాద గ్రూపులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్రిస్మస్ పండుగ కావడంతో, క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ 

ఇది బంగ్లాదేశ్‌లో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ పార్టీ. 1971 విముక్తి యుద్ధం సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిందనే ఆరోపణలతో గతంలో ఈ పార్టీపై నిషేధం ఉండేది. షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఈ పార్టీ నాయకులు దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు రాజ్యాంగాన్ని ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: బంగ్లాదేశ్‌‌లో మూతపడ్డ జర్మనీ, అమెరికా ఎంబసీలు

అమెరికా, జర్మనీ ఎంబసీ మూసివేత

డిసెంబర్ 25న ఢాకా వీధుల్లో భారీ ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని, విదేశీయులు, దౌత్య కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. తమ దేశ పౌరుల భద్రతే ప్రాధాన్యత అని పేర్కొంటూ, అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఆ రోజు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అనవసరంగా బయటకు రావద్దని, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తన పౌరులను హెచ్చరించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, నిరసనకారుల మధ్య చర్చలు ఫలించకపోవడం, వరుసగా జరుగుతున్న అరెస్టులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Also Read: ట్రంప్ కంపు పనులు కవర్ చేస్తూ.. 30,000 పేజీల డాక్యుమెంట్ రిలీజ్

ప్రస్తుత పరిస్థితులు

బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజధాని ఢాకా సహా కీలక నగరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకునే చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, అంతర్గత భద్రతపై నమ్మకం లేకపోవడంతో విదేశీ రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. కేవలం అమెరికా, జర్మనీ మాత్రమే కాకుండా ఇతర యూరోపియన్ దేశాలు కూడా తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి. భారత్, అమెరికా మరియు యూరోపియన్ దేశాలు బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మతతత్వ పార్టీలు పెత్తనం చెలాయిస్తే అది దక్షిణ ఆసియా శాంతికి ముప్పుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు