South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 11 మంది మృతి

దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్‌పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

New Update
South Africa Rocked By Deadly Shooting 11 Killed 14 Injured As Gunmen Open Fire In Hostel

South Africa Rocked By Deadly Shooting 11 Killed 14 Injured As Gunmen Open Fire In Hostel

దక్షిణాఫ్రికా(south-africa) కాల్పులతో(shooting) దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్‌పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ప్రిటోరియాలో సాల్స్‌విల్లేలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ముగ్గురు సాయుధులు హాస్టల్‌లోకి చొరబడ్డారు.  

Also Read: కొనసాగుతున్న రూపాయి పతనం.. స్పందించిన నిర్మలా సీతారామన్..

Gunmen Open Fire In Hostel

అందులో 25 మందిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 3,12 ఏళ్ల బాలురు, 16 ఏళ్ల యువతి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమంగా మద్యం విక్రయించే ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. 

Also Read: భారత్-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే.. !

Advertisment
తాజా కథనాలు