Kerala: షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి... భర్త కుటుంబానికి బిగ్ షాక్‌

కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ విపంచిక షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతికి కారణంగా భావిస్తూ భర్త కుటుంబం పై కేసు నమోదు చేశారు. విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహనన్‌పై కేసు నమోదు చేశారు.

New Update
suicide

suicide

కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతికి కారణంగా భావిస్తూ భర్త, మామ, వదినపై కేరళలో కేసు నమోదు చేశారు.

Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

kerala Women Suicide In  Sharjah

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జాలో విపంచిక అనే మహిళ తన ఏడాది ఐదు నెలల శిశువును చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సామాజిక కార్యకర్తలు వివరాలను వెల్లడించారు. విపంచిక తన భర్తతో కలిసి ఏడు సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చింది. కుటుంబ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా జీవిస్తోందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. మంగళవారం అధికారులు తల్లి, బిడ్డ మృతదేహాలను గుర్తించారని సామాజిక కార్యకర్తలు చెప్పారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

కాగా ఈనెల 8న షార్జాలో బిడ్డను చంపి విపంచిక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో 6 పేజీల నోట్‌ రాసి పోస్ట్ చేసింది.ఈ లేఖలో భర్తపై వరకట్నం, మామపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. విపంచిక ఏడేళ్లుగా షార్జాలోని ఓ సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తుంది. 2020 నవంబర్‌లో నితీష్‌తో వివాహం అయింది. అయితే 
పోర్న్ వీడియోల్లా తనతో కాపురం చేయాలని భర్త చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపించింది. మరోవైపు భర్త ముందే మావ లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. 

Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

విపంచిక అందంగా ఉందని భర్త కుటుంబం గుండు గీయించింది. వరకట్నం కోసం అత్తమామలు, ఆడపడుచు వేధించారని తెలిపింది. చివరికి ఏడాది పాపను చంపేసి తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాగా  విపంచిక తల్లి కేరళ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. దీంతో విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహనన్‌పై కేసు నమోదు చేశారు.

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

suicide | United Arab Emirates | married women suicide | uae | kerala women | kerala

Advertisment
Advertisment
తాజా కథనాలు