H-1B Visa: ట్రంప్ పిచ్చి చేష్టలు.. భారతీయులకు దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా చాలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ హెచ్ 1బీ వీసాల మీద కూడా పడనుందని తెలుస్తోంది. కొన్నాళ్ళ పాటూ వీసాల ప్రాసెసింగ్ నిలిచిపోనుంది.  

New Update
H1B and Green Card visa rules

ట్రంప్(Donald Trump) పిచ్చి చేష్టలకు అంతు లేకుండా పోతున్నాయి. ఇంతకు ముందు వరకు ఇతర దేశాలను ఇబ్బందులను పెట్టిన ఆయన ప్రభుత్వం ఇప్పుడు తన దేశ ప్రజలనే కష్టాల్లోకి నెట్టేసింది. సెనేట్లో బిల్లుల మీద అయిన రచ్చ ప్రభుత్వం మూతబడడానికి కారణం అయింది. దీని కారణంగా పలు ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. 

Also Read :  యూఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్.. వారానికి 15 బిలియన్ డాలర్లు.. 43 వేలమంది నిరుద్యోగులు..

నిధులు కేటాయించకపోవడం వల్లనే..

షట్ డౌన్ ఎఫెక్ట్ మిగతా వాటితో పాటూ హెచ్ 1బీ వీసా(h-1b-visa) లపైనా పడింది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిలోకి రావడం లేదు. అలాగే చాలా కార్యాలయాలు మూతబడ్డాయి. ఇదే కారణంతో హెచ్ 1బీ వీసాల ప్రాసెసింగ్(US H-1B Visa Program Cancelled) కూడా ఆగిపోయింది. షట్ డౌన్ ముగిసిన తర్వాతనే ఈ ప్రక్రియ మళ్ళీ మొదలుపెడతారని ఇమిగ్రేషన్‌ అటార్నీ నికోల్‌ గునర తెలిపారు. కాంగ్రెస్‌లో ఫెడరల్‌ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకుసాగదన్నారు. హెచ్ 1బీ వీసా అప్లై చేసిన తర్వాత లేబర్‌ కండీషన్‌ అప్లికేషన్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ దగ్గర నుంచి కంపెనీలు ధ్రువీకరణ తెచ్చుకోవాలి. దానఇ కన్నా ముందు కంపెనీనే యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసుకు పిటిషన్ను దాఖలు చేస్తుంది. ఇవన్నీ వీసా ఫీజులతోనే చేస్తారు. ఇక్కడి వరకు షట్ డౌన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ డిపార్ట్ ఎంట్ ఆఫ్ లేబర్ కు మాత్రం కాంగ్రెస్ నిధులను కేటాయిస్తుంది. ఇప్పుడు ఈ నిధుల బిల్లే ఆగిపోయింది. దీని కారణంగా లేబర్ ధ్రువీకరణలు జరగవు. దీంతో కొత్త హెచ్‌-1బీల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్‌లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నికోల్ తెలిపారు. 

Also Read:  Shut Down: యూఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్..వారానికి 15 బిలియన్ డాలర్లు..43 వేలమంది నిరుద్యోగులు..

Advertisment
తాజా కథనాలు