Shut Down: యూఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్..వారానికి 15 బిలియన్ డాలర్లు..43 వేలమంది నిరుద్యోగులు..

అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల బిల్లుల విషయంలో సెనేట్లు ఏకభిప్రాయనికి రాకపోవడంతో షట్ డౌన్ ప్రారంభం అయింది. దీంతో అత్యవసర సేవల మిహా ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి. దీని వలన అమెరికాకు తీరని నష్టం ఏర్పడనుందని తెలుస్తోంది. 

New Update
Trump

Trump

షట్ డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. దీని వలన యూఎస్ జీడీపీకి వారానికి 15 బిలియన్ డాలర్లు నష్టపోవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ఒక నెల రోజులు కొనసాగితే కనుక దాదాపు 43 వేల మంది నిరుద్యోగులుగా మారతారని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. షట్‌డౌన్ కారణంగా ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు దాంతో పాటూ ఆరోగ్య బీమా సబ్సిడీలపై రాజకీయ వివాదం కొనసాగుతోంది.  గతంలో షట్‌డౌన్‌ సమయంలో స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగవచ్చని చెబుతున్నారు. షట్ డౌన్ కారణంగా షట్‌డౌన్‌వల్ల 7.5 లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులు విధులకు హాజరు కాలేరు. పలు కార్యాలయాలు పని చేయవు. ఇందులో 80  శాతం మంది వాషింగ్టన్ నుంచే ఉన్నారు. 

పట్టుదలతో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు.. 

బుధవారం అమెరికా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే తాత్కాలిక నిధుల బిల్లును ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఆమోదింపజేసుకోగలిగారు. ఈ బిల్లును పలుమార్లు సెనేట్ లో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేకపోయింది. దీని కోసం 60 ఓట్లు రావాల్సి ఉంది. కానీ రిపబ్లికన్ల మెజారిటీ అంత లేకపోవడం వల్లన విఫలం అయింది. ఇది ఓకే అయి ఉంటే నవంబర్ వరకు ప్రభుతవానికి ఆర్థికనిధులు సమకూరేవి. కానీ సెనేట్ లో కానీ ఒబామాకేర్ ఆరోగ్య బీమా సబ్సిడీలకు నిధుల బిల్లుపై కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండగా..రిపబ్లికన్లు, ట్రంప్ దీనికి అనుమతదించలేదు. ఇది అక్రమ వలసదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో షట్ డౌస్ పడింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయినప్పటికీ లాభం లేకపోయింది. ఆరోగ్య బిల్లుపై డెమోక్రాట్లు పట్టుదలగా ఉన్నారు. అఫర్డబుల్‌ కేర్‌ చట్టం సబ్సిడీల కాలపరిమితి ముగుస్తుండటంతో కోట్ల మందికి ఇబ్బంది కలుగుతుందని వారు చెబుతున్నారు. 

అమెరికాలో షట్ డౌన్ ఎంత కాలం ఉంటుందనేది ఎవరూ చెప్పలేదు. ఇప్పటి వరకు ఇలా 15 సార్లు జరిగింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పుడు దాదాపు 35 రోజుల పాటూ అమెరికా ప్రభుత్వం మూతబడింది. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌.  ఇప్పుడు మళ్ళీ ట్రంప్ హయాంలోనే షట్ డౌన్ అయింది. 

Also Read: Kantara Chapter 1 : అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న కాంతారా చాప్టర్ 1..మరోసారి హిట్ కొట్టిన రిషబ్ శెట్టి

Advertisment
తాజా కథనాలు