/rtv/media/media_files/2025/04/27/dvPS8z14EZTZjNmt6xNk.jpg)
Zelensky
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
Ukraine Comments On Crimea
క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!
telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump
Follow Us