Glass Bottles: బీరు తాగినా.. గ్లాస్ సీసాలో ఏది తాగినా మీ పని ఖతం

ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ విడుదల చేసిన ఓ సర్వే‌లో షాకింగ్ విషయాలున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే గ్లాస్ సీనాలోనే ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయని తేలింది. కూల్‌డ్రింక్స్, నిమ్మరసం, బీరు గాజు సీసాలో పోస్తే లీటరుకు 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయట.

New Update
Microplastics

ఇటీవల చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందని.. గ్లాస్ బాటిళ్లలో వాటర్ తాగుతున్నారు. వారికి ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ ANSES విడుదల చేసిన ఓ అధ్యయనం షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే గ్లాస్ బాటిళ్లలోనే చాలా ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయని ఆ సర్వేలో తేలింది. సాధారణంగా కూల్‌డ్రింక్స్, నిమ్మరసం, ఐస్డ్ టీ, బీరు వంటివి గాజు సీసాలలో లీటరుకు 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయట. ఇది ప్లాస్టిక్ లేదా మెటల్ సీసాల కంటే 50 రెట్లు ఎక్కువ.

జర్నల్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్ అండ్ అనాలిసిస్‌లో ప్రచురితమైన ఫలితాల ప్రకారం.. పరిశోధకులు మొదట గాజు సీసాలు ప్లాస్టిక్ బాటిళ్ల సురక్షితంగా ఉంటాయని భావించారు. కానీ రిజల్ట్స్ చూస్తే షాక్ అయ్యారు. అన్ని సీసాలలో బీర్ బాటిళ్లలో అత్యధిక మైక్రోప్లాస్టిక్ గణన ఉంది. సగటున లీటరుకు 60 కణాలు, నిమ్మరసం దాదాపు 40 శాతం. ప్లాస్టిక్ సీసాలలో లీటరుకు 1.6 కణాలతో పోలిస్తే గాజు సీసాలలో దాదాపు 4.5 కణాలు ఉన్నాయని  పరిశోధనలో తేలింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు