/rtv/media/media_files/2025/07/21/sex-scandal-2025-07-21-17-41-41.jpg)
S*ex Scandal
S*ex Scandal : థాయ్‌లాండ్ బుద్ధిజాన్ని అనుసరించే దేశం, అక్కడ బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా వారిదే పై చేయి. అయితే, ఇప్పుడు వారి ప్రతిష్ట మసకబారేలా కొందరు బౌద్ధ సన్యాసులు ప్రవర్తించిన తీరు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. విలావన్ ఎమ్సావత్ కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
మిస్ గోల్ఫ్‌గా పిలవబడే విలావన్ ఎమ్సావత్ అనే మహిళ.. సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తుంది. కాగా ఈ బండారం బయటపడటంతో జూలై 15న బ్యాంకాక్ సమీపంలోని నోంథబురి ప్రావిన్స్‌లోని తన లగ్జరీ హోమ్‌లో ఆమెను అరెస్టు చేశారు. అంతేకాదు, ఆమెపై బ్లాక్‌మెయిల్, మనీలాండరింగ్, దొంగిలించిన వస్తువుల స్వీకరణ, అవినీతి తదితర ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. బ్యాంకాక్‌లోని వాట్ ట్రి థోట్సాథెప్ మఠాధిపతి ఫ్రా థెప్ వచిరపమోక్ అనే సన్యాసి జూన్ 2025 మధ్యలో అకస్మాత్తుగా అదృశ్యమవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో విషయం బయటకు వచ్చింది.
ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
విలావన్ ఎమ్సావత్11 మంది సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకుంది. అంతేకాక వారి బలహీన క్షణాలను రహస్యంగా ఫోటోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కొన్ని వందల ఏళ్లుగా తపోనిష్టతో కొనసాగుతున్న బౌద్ధ ధర్మానికి మచ్చగా మారిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఘటనతో మఠాలపై గౌరవం పోయిందని ఆ దేశ ప్రజలు వాపోతున్నారు.
ఇది కూడా చూడండి:Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత
కాగా విలావన్ ఎమ్సావత్ బౌద్ధ సన్యాసులతో సెక్స్ సంబంధాలు కొనసాగించడంతో పాటు ఆమె వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రికార్డు చేసింది.అలా సుమారు 80వేల వీడియోలు, ఫోటోలు తీసింది. వాటితో సన్యాసులను బ్లాక్ మెయిల్ చేసి సుమారు రూ. 102 కోట్లు దోచుకుంది.ఇదంతా కూడా కేవలం మూడేండ్లలోనే దోచుకుంది. ఈ నిధులు ఆలయ ఖాతాల నుండి బదిలీ చేయబడ్డాయి. తాను గర్భవతినని.. అతనే తన బిడ్డకు తండ్రి అని చెప్పి.. వారిలో కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసి మెర్సిడెస్-బెంజ్ SLK200 వంటి ఖరీదైన బహుమతులు కూడా అందుకుంది. దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఖర్చు చేసింది. సన్యాసులు తనను రోజుకు రూ. 90,000లతో షాపింగ్ చేయించే వారని సదరు మహిళ చెప్పడం గమనార్హం.ఈ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారడంతో థాయ్ లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్స్ సీరియస్ అయ్యారు. అంతేకాక తన పుట్టినరోజు వేడుకులకు బౌద్ధ సన్యాసులను ఆహ్వానించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం, ఈ స్కాండల్‌లో ఇరుకున్న బౌద్ధ సన్యాసులను తొలగించారు. దీనిపై విచారణ చేపట్టారు.
Also Read : షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!
థాయ్ పురుషులు సాంప్రదాయకంగా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా సన్యాసులుగా ఉండాలనే నియమం ఉంది. అలా కొన్ని వారాలు లేదా ఏండ్లు కూడా ఉంటుంది. మతాధికారులు 227 కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటిలో హస్తప్రయోగంపై నిషేధం, స్త్రీలను తాకడం, వారి నుండి నేరుగా వస్తువులను తీసుకోవడం కూడా ఉన్నాయి. సన్యాసులు సాంప్రదాయకంగా భిక్ష, ఆహార నైవేద్యాలు, నెలవారీ $170 నిరాడంబరమైన స్టైఫండ్‌తో జీవించాల్సి ఉంటుంది. అయితే ఒక మహిళ చేసిన పనికి 11 మంది బౌద్ధ సన్యాసులు తమ నియమాలను మంట గలపడమే కాకా బుద్ధిజానికి చెరగని మచ్చ తెచ్చారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్