/rtv/media/media_files/2026/03/01/iran-raises-red-flag-over-mosque-after-khamenei-killing-2026-03-01-21-51-37.jpg)
Iran Raises Red Flag Over Mosque After Khamenei Killing
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే ఖమేనీ మృతితో ఇరాన్‌కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్న మసీదుపై ఎర్ర జెండా ఎగురవేశారు. ఆదివారం జాంకరన్ మసీదు గోపురంపై ఈ జెండా రెపరెపలాడింది.
ఆ మసీదుపై ఇలా ఎర్ర జెండా ఎగురవేయడాన్ని ప్రతీకారంగా సూచిస్తారు. ప్రస్తుతం ఇరాన్.. ఇజ్రాయెల్‌తో పాటు కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, కత్తార్, బెహ్రాన్‌లో ఉన్న అమెరికా ఆర్మీ, నేవీ స్థావరాలపై దాడులు చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ముస్లిం దేశాల్లో అలీ ఖమేనీకి సపోర్ట్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. అందుకే తమ శత్రువులపై పెరుగుతున్న ప్రతీకారాన్ని మసీదుపై ఉన్న ఆ ఎర్రజెండా ప్రతిబింబిస్తోంది.
Also Read: ఇరాన్‌పై దాడుల్ని భారత్ ఖండించాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇదిలాఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. తమ దేశ సాయుధ దళాలు శత్రు టార్గెట్‌లపై దాడులు చేస్తూనే ఉంటాయని తేల్చిచెప్పారు. ఖమేనీ నిర్దేశించిన మార్గాన్నే ఇరాన్ పాటిస్తుందని స్పష్టం చేశారు. ఆయన మరణం అనంతరం ఏర్పడ్డ నాయకత్వ మండలి కూడా తమ పని ప్రారంభించినట్లు తెలిపారు. శత్రువులపై ఇరాన్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు.
అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియామకం అయ్యారు. ఈయన ఖమేనీకి చెందిన అత్యంత సన్నిహిత వర్గంలో ఒకరు. ఈ నియామకం తర్వాత అరాఫీ.. ముగ్గురు సభ్యుల లీడర్‌షిప్ కౌన్సిల్‌లో చేరారు. ప్రస్తుతం అలిరెజా ఇరాన్ చట్టాలను సమీక్షించే 'గార్డియన్ కౌన్సిల్' సభ్యుడిగా, సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఇరాన్‌లోని అన్ని షియా మత విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మరీ ఈ తాత్కాలిక నాయకత్వంలో ఇరాన్‌లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అనేది దానిపై స్పష్టత లేదు.
Follow Us