Russian strikes: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. 20 మంది మృతి

రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడింది. అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో దాడులు మరింత తీవ్రతరం చేసింది.ఈ దాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Russia attacked on Ukraine

Russia attacked on Ukraine

రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడింది. అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లో ప్రధాన నగారాలైన ఖార్కీవ్, డొంటెస్క్‌లోని నివాస స్థలాలపై రాత్రివేళ డ్రోన్స్‌, మిసైల్స్‌తో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. డెనట్‌ పాఠశాలలోని డోబ్రోపిల్యాలో 8 నివాస భవనాలు, ఒక అడ్మినిస్ట్రేషన్‌ భవనాలపై ఈ దాడులు జరిగాయి. దీంతో అవి పూర్తిగా ధ్వంసమైపోయాయి.    

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

  ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ అమలు చేయాలని ట్రంప్‌ రష్యాకు వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేకుంటే ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్‌పై దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ట్రంప్‌ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉక్రెయిన్‌కు నిఘా, సైనిక సాయాన్ని కూడా నిలిపివేశారు. అమెరికా శాటిలైట్‌ ఫొటోలు కూడా షేరింగ్ చేయలేదు. దీంతో రష్యా బాంబు దాడుల నుంచి ఉక్రెయిన్‌కు రక్షించుకునే సామర్థ్యం తగ్గిపోయింది. 

Also Read:హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక..

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్, రష్యా మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించారు. కానీ అది విఫలం అయ్యింది. మరోవైపు ఉక్రెయిన్‌.. అమెరికా ప్రతిపాదించిన ఖనిజ సంపంద ఒప్పందంపై కూడా చేయకపోవడం దుమారం రేపింది. ఆ తర్వాత మళ్లీ జెలెన్‌స్కీ సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికీ.. ఉక్రెయిన్‌కు భద్రత ఇవ్వాలని స్పష్టం చేశారు.రష్యా మళ్లీ దాడులు చేయకుండా చూడాలన్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read:లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read:మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.2500 స్కీమ్‌ ప్రారంభం
Advertisment
తాజా కథనాలు