Russia-Ukraine War: పుతిన్‌ దెబ్బ.. ఉక్రెయిన్‌ బ్రిడ్జిని పేల్చేసిన రష్యా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కీలకమైన వంతెనను రష్యా పేల్చేసింది. అలాగే వందకు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందారు.

New Update

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కీలకమైన వంతెనను రష్యా పేల్చేసింది. అలాగే వందకు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. అంతకుముందు రష్యన్ ఆయిల్‌ రిఫైనరీని ఉక్రెయిన్ పేల్చిసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా.. ఉక్రెయిన్‌ వంతెనపై పేల్చిసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడి గవర్నర్‌ స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: హమాస్‌ భూగర్భ సొరంగంలో ఇజ్రాయెల్ బందీ.. తిండి లేక, బక్క చిక్కిన శరీరంతో దీన స్థితి

ఇదిలాఉండగా అంతకుముందు ఉక్రెయిన్.. రష్యా ఆయిల్‌ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా అక్కడ మంటలు చెలరేగాయి. అయితే రష్యన్ సైనిక అవసరాలు తీర్చేందుకు ఈ ఆయిల్‌ రిఫైనరీ నుంచే ఇంధనం సరఫరా అవుతోందని తెలుస్తోంది. అలాగే మిలిటరీ ఎయిర్‌బేస్‌తో సహా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్‌ దాడులు చేసింది. మరోవైపు రష్యాకు సమీపంలోని రెండు అమెరికన్ అణు జలాంతర్గాములు కూడా రంగలోకి దిగడం దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా జోక్యంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. ఏజెంటిక్‌ ఏఐతో ఈ రంగాల వారి జాబ్‌లు ఔట్.. 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతు!

అయితే పశ్చిమ దేశాల భద్రతను బలోపేతం చేసేందుకే అమెరికా న్యూక్లియర్ సబ్‌ మెరైన్లను రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న క్రమంలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అంటున్నారు. రష్యాకు అమెరికా శక్తి, సామర్థ్యాన్ని చూపించేందుకే ట్రంప్ ఇలా చేసినట్లు మరికొందరు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్  స్పందించారు. ట్రంప్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ విధానాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. సోవియట్ కాలం నుంచే రష్యాకు అణ్వాయుధాలు ఉన్నాయన్నారు. తమ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని ట్రంప్‌ను హెచ్చరించారు.  

Also Read: రష్యాలో మళ్లీ భూకంపం.. బద్ధలైన అగ్నిపర్వతం.. వీడియోలు వైరల్

యుద్ధం ఎలా మొదలైంది

2022న ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌ రష్యా సైనిక చర్య పేరుతో యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నించడంతో దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. అందులో కలవకూడదని హెచ్చరించింది. కానీ ఉక్రెయిన్‌ రష్యా మాటలను పట్టించుకోలేదు. చివరికి సైనిక చర్య పేరుతో పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాడు. మరోవైపు ఈ యుద్ధానికి ములాలు అంతకుముందు కూడా ఉన్నాయి. 2014లో రష్యా క్రిమియాను కలుపుకుంది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగూనే ఉన్నాయి. అయితే 2022లో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాలు ఒకదానికొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకంటూనే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు