/rtv/media/media_files/2025/08/03/volcanic-eruption-2025-08-03-14-44-32.jpg)
Tsunami possible in Russia's Kamchatka after 7 magnitude earthquake, volcanic eruption
రష్యాలోని మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఆదివారం కురిల్ దీవుల్లోని రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప ప్రభావానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు. అయితే పలు నగరాల్లో భవనాలు ఉగినట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది.
పేలిన అగ్నిపర్వతం
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రాషెన్నినికోవ్ అనే అగ్నిపర్వతం బద్ధలైంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల వచ్చిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం బద్ధలు కావడంతో బూడిద 6 వేల మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడినట్లు చెప్పారు. ఇక మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన మరో అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ కూడా పేలిపోయింది.
JUST IN: WATCH: FIRST RECORDED ERUPTION OF KRASHENINNIKOV VOLCANO IN KAMCHATKA IN RUSSIA
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) August 3, 2025
Could have been triggered by the 8.8 Earthquake last week. pic.twitter.com/dQKjquhtXJ
FIRST RECORDED ERUPTION of Krasheninnikov volcano in Kamchatka, Russia. pic.twitter.com/RsdYDptbky
— Adam Kruś (@adam_krus) August 3, 2025
ఇదిలాఉండగా ఇటీవల రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం దాటికి జపాన్, రష్యాతో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాల్లో సునామీ అలలు తాకాయి. 2011లో పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి భూకంపం వచ్చినట్లు నిపుణులు తెలిపారు. ఆ తర్వాత ఇదే భారీ భూకంపమని పేర్కొన్నారు. మళ్లీ భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.ఇదిలాఉండగా ఈ మధ్య వరుసగా చాలా దేశాల్లో భూకంపాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక్కరోజే భారత్, ఇరాన్, తజికిస్తాన్‌లో భూకంపాలు సంభవించడం కలకలం రేపింది.
భూకంపాలు ఎలా వస్తాయి
భూ ఉపరితలం కిద ఉన్న శిలాఫలకాల (టెక్టోనిక్ ప్లేట్లు) కదలికల వల్లే భూకంపాలు వస్తుంటాయి. ఈ శిలాఫలకాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు లేదా ఢీకొన్నప్పుడు.. తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ శక్తి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో అగ్నిపర్వతాలు పేలడం, భూగర్భ జలాల ప్రవాహంలో మార్పులు, పెద్ద డ్యామ్‌ల నిర్మాణం, గనుల తవ్వకం వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల కూడా కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ ద్వారా కొలుస్తారు. ఈ తీవ్రతను బట్టి భూకంపం వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేస్తారు. రిక్టర్ స్కేల్‌పై 7.0 కంటే ఎక్కువ తీవ్రత నమోదైతే అది భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగుతుంది.