Russia: 1,500 ఈగలు, 75 ఎలుకలను అంతరిక్షంలోకి పంపిన రష్యా.. ఎందుకో తెలుసా?

రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Russia sent 75 mice into space, only 65 returned alive, Know details

Russia sent 75 mice into space, only 65 returned alive, Know details

రష్యా మరో అద్భుతం స-ృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన బయోలాజికల్ రీసెర్చ్ ఉపగ్రహం 30 రోజుల అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేసి సెప్టెంబర్ 19న సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చింది. అయితే ఈ మిషన్‌లో 75 ఎలుకలు, 1500పైగా ఈగలతో పాటు మొక్కల విత్తనాలు, సూక్ష్మజీవులను పంపించారు. వీటిలో 65 ఎలుకలు వెనక్కి తిరిగిరాగా మిగిలినవి మృతి చెందాయి. ఆగస్టు 20న కజకిస్థాన్‌లోని బైకోనూర్‌ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ 2.1బి  రాకెట్‌లో ఈ శాటిలైట్‌ను ప్రయోగించారు.

Also Read: సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?

 ఈ మిషన్‌ భూమిపైకి చేరుకున్నాక అంతరిక్ష ప్రయాణంలో వాటి నాడి వ్యవస్థలపై ప్రభావాన్ని గుర్తించేందుకు ఎలుకలు, ఈగలను పరిశీలించారు. ఈ శాస్త్రీయ కార్యక్రమాన్ని మొత్తం  10 విభాగాలుగా విభజించారు. మొదటి రెండు విభాగాలు జంతువులపై గురత్వాకర్షణ, రేడియేషన్ ప్రభావాలు అధ్యయనం చేయనున్నాయి. మూడు నుంచి ఐదు విభాగాలు మొక్కలు, సూక్ష్మజీవులను పరిశీలించనున్నాయి. ఆరు నుంచి తొమ్మిది విభాగాలు బయోటెక్నాలజీ, రెడియేషన్ రక్షణ, కొత్త సాంకేతికతను పరీక్షించనున్నాయి. ఇక పదవ విభాగాన్ని రష్యా, బెలారస్ నుంచి వచ్చిన విద్యార్థుల ప్రయోగాలకు కేటాయించారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు

ఇక్కడ మరో విషయం ఏంటంటే రష్యా ఉల్కాపతం ప్రయోగాన్ని కూడా నిర్వహించింది. ఈ ప్రయోగంలో భూమిపైకి జీవం అంతరిక్ష నుంచి వచ్చి ఉండొచ్చనే అంశంపై పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే రష్యా కూడా త్వరలో మనుషులను అంత క్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 

Also Read: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు