Earthquake: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో ఉదయం 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

New Update
BREAKING

BREAKING

రష్యా(russia) లో మళ్లీ భారీ భూకంపం(earthquake) సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో ఉదయం 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:49 గంటలకు 126. కి.మీ లోతులో భూకంపం సంభవించింది. భయంతో జనం పరుగులు పెడుతున్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Canada: భారత విద్యార్థులకు కెనడా షాక్.. 74 శాతం దరఖాస్తుల తిరస్కరణ

Earthquake In Russia

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఇండోనేషియాలో మళ్ళీ భారీ భూకంపం..వారంలో రెండవసారి

ఇదిలా ఉండగా ఇండోనేషియాలో మరోసారి భూకంపం వణికించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయాన్నే సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది. వారంలో ఇది రెండవ అతి పెద్ద భూకంపం అని చెప్పింది. అయితే దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. గత వారం మలుకు దీవుల సమీపంలో బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Advertisment
తాజా కథనాలు