BIG BREAKING: ఇండోనేషియాలో మళ్ళీ భారీ భూకంపం..వారంలో రెండవసారి

ఇండోనేషియాలో మళ్ళీ భూకంపం సంభవించింది. ఈ వారంలో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండవ సారి. సలవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.

New Update
Earthquake

Earthquake

ఇండోనేషియాలో మరోసారి భూకంపం వణికించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయాన్నే సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది. వారంలో ఇది రెండవ అతి పెద్ద భూకంపం అని చెప్పింది. అయితే దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. గత వారం మలుకు దీవుల సమీపంలో బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

దీనికి ముందు సోమవారం ఆప్ఘనిస్థాన్‌లోమజార్-ఎ-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. వందలాది మంది గాయాల పాలయ్యారు. నగరంలో చారిత్రాత్మక బ్లూ మసీద్ దెబ్బతిందని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు