Canada: భారత విద్యార్థులకు కెనడా షాక్.. 74 శాతం దరఖాస్తుల తిరస్కరణ

కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారత విద్యార్థులకు పెద్ద షాక్ తగిలింది. ఈ ఏడాది ఆ దేశం 74 శాతం విద్యార్థి వీసాలను రిజెక్ట్ చేసింది. వరుసగా రెండో ఏడాది ఇంత మొత్తంలో వీసాలను తిరస్కరించింది.

New Update
Canada students

Canada students Photograph: (Canada students)

అమెరికా బాటలోనే కెనడా కూడా పయనిస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేస్తూ వీసాలను తిసర్కరిస్తోంది. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్‌లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాకు వీసాల కోసం అప్లై చేసిన దరఖాస్తుల్లో ఏకంగా 74 శాతం తిరస్కరణకు గురైయ్యాయి. 2023లో ఇదే కాలంలో తిరస్కరణ రేటు కేవలం 32శాతం అయ్యాయి. చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో కేవలం 24 శాతం రిజెక్ట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఆగస్టులో దాదాపు 40 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించింది.

ఫేక్ లెటర్స్..

2023 ఆగస్టులో 20,900 మంది ఇండియన్ స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది సంఖ్య ఏకంగా 4,515కు పడిపోయింది. 1000 కంటే ఎక్కువ వీసా దరఖాస్తుల ఆమోదం పొందిన దేశాల పరంగా చూస్తే..ఒక్క భారత్ నుంచి మాత్రమే ఎక్కువ సంఖ్యలో వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురైయ్యాయి. వీసా దరఖాస్తుల్లో మోసాలపై కెనడా అధికారులు ఉక్కుపాదం మోపుతుండడమే దీనికి కారణమని చెబుతున్నారు. దాంతో పాటూ 2023లో అక్కడి అధికారులు దాదాపు 1500 మోసపూరిత ఎక్సెప్టెన్స్ లెటర్స్‌ను గుర్తించారు. వీటిలో ఎక్కువ భారత్ నుంచే వచ్చినవేనని చెబుతున్నారు. దీంతో ఏడాది మరీ ఎక్కువగా తనిఖీలను నిర్వమించారు. ఈ సారి 14 వేల లెటర్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌లల్లో మోసాలు జరిగినట్టు తెలిసింది. 

#today-latest-news-in-telugu #visa #canada #students
Advertisment
తాజా కథనాలు