HBD Shiva Rajkumar: కరునాడ చక్రవర్తి నిమ్మ శివన్న.. శివరాజ్ కుమార్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈమేరకు ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
హ్యాట్రిక్ హీరో
కెరీర్ తొలినాళ్లలో ఆయన నటించిన మొదటి మూడు సినిమాలు
'ఆనంద్', 'రథ సప్తమి' , 'మనమేచిద' బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఆయనకు అభిమానులు హ్యాట్రిక్ హీరో అనే బిరుదును ఇచ్చారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ఆయనే.
125+ సినిమాలు
దాదాపు 4ఓ ఏళ్ల సినీ కెరీర్ లో శివ రాజ్ కుమార్ 125కి పైగా సినిమాల్లో నటించారు. వివిధ రకాల జానర్స్ , విభిన్న పాత్రలతో బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. 'ఆనంద్', 'ఓం', 'జోగి', 'మైత్రి', 'ముఫ్తీ', 'బజరంగి', 'కవచ' వంటి సినిమాలు ఆయన కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిచాయి.
'ఓం' సినిమాతో ట్రెండ్ సెట్టర్
ఉపేంద్ర దర్శకత్వంలో 1995లో వచ్చిన 'ఓం' సినిమా శివన్న కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అండర్ వరల్డ్ కథా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం కన్నడ సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాలో నిజమైన గ్యాంగ్‌స్టర్‌లు నటించడం విశేషం.
సొంత గుర్తింపు
కన్నడ సినీ దిగ్గజం డా. రాజ్‌కుమార్ వారసుడిగా శివన్న సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ.. తన నటన, వ్యక్తిత్వంతో సొంత గుర్తింపు సంపాదించుకున్నారు. తనదైన శైలిలో నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
ఫిట్‌నెస్, ఎనర్జీ
50ఏళ్ళ వయసు దాటినా, శివరాజ్ కుమార్ ఇప్పటికీ చాలా ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయన డాన్స్ మూమెంట్స్, యాక్షన్ సన్నివేశాలలో చూపించే ఉత్సాహం యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోవు.
క్యాన్సర్‌పై విజయం
ఇటీవలే శివరాజ్ కుమార్ తాను క్యాన్సర్‌తో పోరాడి గెలిచినట్లు తెలిపారు. అమెరికాలో చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. తన క్యాన్సర్ ప్రయాణంపై ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!