/rtv/media/media_files/2025/07/11/coolie-monica-song-2025-07-11-18-40-11.jpg)
COOLIE Monica Song
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "కూలీ" నుండి రెండవ సింగిల్ "మోనిక" ఈరోజు (జూలై 11) సాయంత్రం విడుదలయ్యింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మాస్ బీట్ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అలరించింది. "మోనిక" పాట విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
COOLIE New Song
Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
అనిరుధ్ కంపోజిషన్, వోకల్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విష్ణు ఎడవన్ సాహిత్యం అందించిన ఈ పాటలో అనిరుధ్ తో పాటు సుభాషిణి కూడా గానం చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఈ చిత్రంలో క్యామియో రోల్‌లో కనిపించనున్నారు.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
‘‘కూలీ’’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘‘చికిటు’’ పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘‘మోనిక’’ పాట విడుదలవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.