/rtv/media/media_files/2025/07/31/cynthia-erivo-actress-got-her-mouth-insured-2025-07-31-18-30-00.jpg)
Cynthia Erivo Actress Got Her Mouth Insured
Cynthia Erivo:
సాధారణంగా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కానీ ఓ నటి మాత్రం కేవలం తన నోటికి మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.16.5 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. ఆమె ఎవరో కాదు బ్రిటిన్‌కు చెందిన నటి, సింగర్ సింథియా ఎరివో. ఆమె ఇలా ఎందుకు చేయించుకుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మౌత్‌వాష్ బ్రాండ్ లిస్టెరిన్.. 'వాష్ యువర్ మౌత్' అనే కార్యక్రమం నిర్వహిస్తోంది.
Also Red: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్
దీనికి సింథియా ప్రచారకర్తగా ఉన్నారు. ఈమె తన నోటి శుభ్రతపై ఎక్కువగా కేర్ తీసుకుంటోంది. తన నవ్వు, గొంతుకు ఉండే ప్రత్యేకత వల్లే తన వృత్తి, వ్యక్తిగత జీవితంలో రాణిస్తున్నానని సింథియా చెప్పింది. అంతేకాదు ఆమె స్టేజిపై ఎక్కేముందుకు కూడా ప్రతిసారి బ్రష్ చేసుకుంటుంది. మౌత్ వాష్ వాడుతుంది. ఇలా చేయడం తనకు ఆత్మవిశ్వాసం పెంచుతుందని సింథియా ఎప్పుడూ చెబుతుంటారు. తన దంతాల మధ్య ఉండే గ్యాప్‌ను, నవ్వు, గళాన్ని కాపాడుకునేందుకే ఈ నోటీ బీమా తీసుకున్నానని వెల్లడించారు.
Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
ఇక వివరాల్లోకి వెళ్తే.. సింథియా ఎరివో (38) బ్రిటన్‌లోని లండన్‌లో జన్మించారు. ఈమె తన నటన, పాటలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఎమ్మీ, గ్రామీ, టోనీవంటి అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆమె నటించిన చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్, విక్డ్:ఫర్ గుడ్ సినిమాలు మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్నాయి. అయితే ఆమె నోటికి ఇన్సూరెన్స్ తీసుకున్న విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అత్యంత విలువైన చిరునవ్వు కలిగిన మహిళగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
అయితే ఇలా కేవలం శరీర భాగానికి ఇన్సూరెన్స్ చేయించుకుంది సింథియా ఎరివో మాత్రమే కాదు. ఇలాంటి సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అమెరికాకి చెందిన గాయని 'మారియా కరే' కేవలం తన కళ్లు, స్వరపేటిక కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంది. ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్‌హామ్ కూడా తమ కాళ్లకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. బ్రిటిష్‌కు చెందిన సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్‌సే కేవలం తన నాలుకకు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇక జెన్నిఫర్ లోపేజ్ తన వీఫు భాగానికి ఏకంగా రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇలా సెలబ్రిటీలు కేవలం ఇలా శరీర భాగాలుకు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవడం చూసి జనాలు షాకవుతున్నారు. ఇలా కేవలం విడి భాగాలకు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read: 30 దేశాలపై రష్యా సునామీ విధ్వంసం.. సముద్రం పక్కనున్న భారత్ పరిస్థితి ఏంటి?