అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన ట్రంప్ గ్రాండ్ విక్టరీ సాధించారు. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో గెలిచి మరీ పీఆన్ని దక్కించుకున్నారు. అయితే అంతకు ముందు ఎన్నికల సమయంలో ట్రంప్ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రెండుసార్లు ఆయనను చంపడానికి ప్రయత్నించారు. ఒకసారి చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్న పరిస్థితి కూడా వచ్చింది. ప్రచారంలో ఉన్న ఆయనపై నేరుగా కాల్పులు చేశారు. అయితే అదృష్టవశాత్తు తుపాకీ తూటా చెవిని తాకుతూ వెళ్ళిపోవడంతో చిన్న గాయంతో.. ప్రాణాలతో బయటపడ్డారు ట్రంప్. మరోసారి హత్యాయత్నం జరగకముందే నిందితుడిని పట్టుకోవంతో అప్పుడుకూడా తప్పించుకున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాక కూడా ట్రంప్‌కు ఎపపుడూ ముప్పు పొంచే ఉంటుంది. అయితే వీటన్నింటకీ ఆయన ముందుగానే సిద్ధమయ్యారు. వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టాక ట్రంప్‌కు పెద్ద ఎత్తున సెక్యూరిటీనే ఉంటుంది. అప్పుడు వైట్ హౌస్‌లోఇ చిన్న చీమ కూడా అడుగుపట్టలేదు.
Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!
రోబో కుక్కులు..
Also Read: Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ
అయితే ట్రంప్ వైట్ మౌష్‌కు వెళ్ళడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అధ్యక్షుడగా ట్రంప్ ఖాయమైపోయినా...రూల్స్ ప్రకారం ఆయన తన పదవిని వచ్చే ఏడాది జనవరి 20 తర్వానే చేపడతారు. అప్పటి వరకు ట్రంప్ తన ఎస్టేట్‌లోనే ఉండాలి. అందుకే ఈ లోపు తనకు ఏమీ జరగకుండా...ఎవరూ ఎటువంటి అటాక్ చేయకుండా తగిన చర్యలు తీసకున్నారు. ట్రంప్ ఎస్టేట్‌లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే చీఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ను నియమించారు. అయితే ట్రంప్ సెక్యూరిటీలో ఓ ప్రత్యేకత ఉంది. అదే రోబోటిక్ డాగ్స్.. ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ అయిన మార్ ఏ లాగో ఉట్టూ పెట్రోలింగ్ నిర్వహించేందుకు అమెరికాఉ చెందిన సీక్రెట్ సర్వీసెస్...రోబోటిక్ డాగ్స్‌ను ఉపయోగిస్తోంది. బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో కుక్కలు ఆయన ఇంటి ఇప్పుడు 24 గంటలూ పహారా కాస్తున్నాయి. రోబోటిక్ సైన్స్‌తో పని చేసే ఈ డాగ్స్ మామూలు కుక్కల కన్న ఆపవర్ ఫుల్ అని చెబుతున్నారు. తమ సెన్సార్స్‌తో మామూలు కుక్కల కన్నా వేగంగా పసిగట్టగలవని అంటున్నారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఈ రోబో కుక్కలు పట్టిచ్చేస్తాయని సీక్రెట్ సర్వీసెస్ తెలిపింది.
Also Read: RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!