RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ

డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ. 

New Update
ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?

 South Indian Bank: 

దేశంలో ఉన్న బ్యాంకులన్నింటికీ బాస్ ఆర్బీఐ. ఇరంతరం ఇది అన్ని బ్యాంకుల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ బ్యాంకు ఎలాంటా లోపం తలెత్తినా వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులపై వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పడు తాజాగా ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది ఆర్బీఐ. లక్షల రూపాయల ఫైన్ విధించిందని తెలుస్తోంది. 

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

సౌత్ ఇండియన్ బ్యాంక్...

సౌత్ ఇండియన్ బ్యాంక్...దేశంలో ఉన్న పెద్ద బ్యాంక్‌లలో ఇది ఒకటి. ఇప్పుడు ఈ బ్యాంకుపైనే ఆర్బీఐ చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంకు తన బ్రాంచ్‌లలో డిపాజిట్లు, కస్టమర్లకు నిర్ణయించే వడ్డీ రేట్లు లాంటి విషయాల్లో కొన్ని సూచనలు పాటించడంలో తప్పు చేసిందని ఆర్బీఐకు ఫిర్యాదులు అందాయి. దీని మీద విచారణ చేసింది ఆర్బీఐ.మార్చి 31, 2023 వరకు బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి, బ్యాంక్ ఆడిట్ విలువ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పరీక్షను నిర్వహించింది. అవి నిజమని తేలడంతో వెంటనే చర్యలను చేపట్టింది. ముందుగా బ్యాంకుకు ఈ విషయమై నోటీసులు అందజేసింది ఆర్బీఐ. తర్వాత బ్యాంకు నుంచి వచ్చిన సమాధానం విన్న తర్వాత చర్యలు చేపట్టింది. సౌత్ ఇండియన్ బ్యాంకుకు 59.20 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు బ్యాంకుకు సమాచారం అందించింది. 

Also Read: Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

అసలేం జరిగింది...

సాధారణంగా అన్ని బ్యాంకులకు కొన్ని రూల్స్ ఉంటాయి. మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి, వడ్డీ రేటలు ఒక్కో దానికి ఒక్కోలా ఇంత ఉంటాయి ఇలా..ఏ బ్యాంకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలను కంటిన్యూ చేయదు. కానీ సౌత్ ఇండియన్ బ్యాంకు తనకు సంబంధించిన కొన్ని బ్రాంచ్‌లలో ఈ విషయంలో రూల్స్ పాటించలేదు. తమ కస్టమర్లకు వారి బ్యాంక్ బాలెన్స్ ఎంత ఉండాలి, లేదా తగ్గిపోయింది లాంటి సమాచారాన్ని తెలపలేదు. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని నిర్వహించడంలో కూడా ఫెయిల్ అయింది. ఇది బ్యాంకు నిర్వహణలో ప్రాథమిక తప్పు అవడంతో ఆర్బీఐ ఎంటనే చర్యలు తీసుకుంది. ప్రతీ బ్యాంకు చట్ట బద్ధమైన నియంత్రణకు లోబడి పని చేయాలి. అలా చేయని పక్షంలో పెనాల్టీ తప్పనిసరిగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.  దీనివలన సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు, కస్టమర్లకు మధ్య ఎటువంటి ఇబ్బందులు కలగవని స్పష్టం చేసింది. దీని తర్వాత కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్ యథావిధిగా పని చేస్తుందని తెలిపింది. 

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

 

ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు