/rtv/media/media_files/2025/11/13/red-brezza-belonging-to-dr-shaheen-found-at-al-falah-2025-11-13-15-22-38.jpg)
Red Brezza Belonging to Dr Shaheen Found at Al-Falah
ఢిల్లీ బాంబు పేలుడు(Delhi Bomb Blast) ఘటన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్‌ఫలా యూనివర్సిటీ పేరు హల్‌చల్‌గా మారింది. ఆ యూనివర్సిటీకి చెందిన వైద్యులే బాంబు దాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఫరీదాబాద్ డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్‌పై జరిపిన విచారణలో నాలుగు కార్లు ఉన్నాయని తేలింది. ఒకటి డా.షాహిన్‌ది డిజైర్ కారు కాగా రెండోవది పేలిపోయిన i20 కారు. మూడవది ఎకోస్పోర్ట్ కారు, నాలుగవది బ్రెజా కారు. ఈ వాహనాలను ఢిల్లీ-NCR లో నిఘా కోసం, పేలుడు పదార్థాలు అమర్చి దాడులు చేసేందుకు ప్లా్న్ చేసినందుకు వాడినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా మూడు కార్లు లభ్యం కాగా.. బ్రెజా కారు ఆచూకి కనిపించలేదు. అయితే తాజాగా అధికారులు ఆ కారును కూడా అల్‌ఫలా యూనివర్సిటీలోనే గుర్తించారు.
Also Read: సర్వే సంస్థలని 2సార్లు బురిడీ కొట్టించిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. మరీ ఈసారి!?
Red Brezza Belonging To Dr Shaheen Found At Al-Falah
ఆ యూనివర్సిటీ ఆవరణలోనే ఈ కారు పార్క్ చేసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ బ్రెజా కారు కూడా ఇటీవల అరెస్టయిన డా.షాహిన్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఈ కారులో కూడా 300 కిలోల పేలుడు పదార్థాలు ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్రెజా కారుపై విచారణ జరుగుతోంది. ఈ నాలుగు కార్లలో రెండు కార్లు కూడా డా. షాహిన్ పేరు మీదే రిజిస్టర్ అవ్వడం గమనార్హం.
Also Read: ఢిల్లీ పేలుడులో షాకింగ్ ఘటన.. 300 మీటర్ల దూరంలో తెగిపడిన చేయి.. భయపడుతున్న స్థానికులు
ఇక ఫరీదాబాద్ జిల్లాలో ఖాండవాలీ గ్రామంలో డా.ఉమర్‌కు చెందిన ఎకోస్పోర్ట్స్ కారును దర్యాప్తు బృందాలు గుర్తించిన విషయం తెలిసిందే. దీన్ని తనిఖీ చేయగా అందులో అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు సమాచారం. ఈ కారును ఆ పేలుడు పదార్థాన్ని రవాణా చేసేందుకు ఉపయోగించి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో i20 కారు పేలిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 13 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు డా.షాహిన్, డా. ముజమ్మిల్ గనై, డా. అదీల్ అహ్మద్ రథర్, డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ నలుగురు కూడా అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన వైద్యులే కావడం కలకలం రేపుతోంది.
Follow Us