Prince Andrew: కొంప ముంచిన ఎపిస్టీన్ ఫైల్స్.. రాజవంశీకుడినే గెంటేశారు..

తమ్ముడైనా తప్పు చేస్తే వదిలేదే లేదంటున్నారు బ్రిటన్ రాజు ఛార్లెస్ 3. ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంలో ప్రిన్స్ ఆండ్రూ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనను రాజకుటుంబం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఛార్లెస్. ఆండ్రూను ప్యాలెస్ నుంచి బయటకు పంపేశారు.

New Update
prince andrew

ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసింది. ట్రంప్, మస్క్ లతో సహా చాలా మంది పేర్లే ఇందులో బయటకు వచ్చాయి. వీరితోపాటూ బిట్రన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా వినిపించింది. ఆండ్రూ పేరు రావడమే కాదు...ఆయన ఆ కుంభకోణంలో భాగమేనని తెలిసింది. దీంతో తన రాయల్ టైటిల్ ను కూడా వదులుకున్నారు. తాజాగా ఆండ్రూ విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రటిన్ రాజు ఛార్లెస్ 3(king-charles-3) తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులు అన్నింటినీ తొలగించడమే కాకుండా..అతన్ని ప్యాలెస్ నుంచి కూడా బయటకు పంపించేశారని తెలుస్తోంది. బకింగ్ హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ప్రకటించింది. 

Also Read :  ఆశపెట్టి.. తిరిగి లాగేసుకుంటున్నారు..జేడీ వాన్స్ పై తిరగబడ్డ భారత మహిళ

తమ్ముడైనా..అన్యాయం చేస్తే అంతే..

బ్రిటిన్ రాజులు చాలా పద్ధతిగా ఉంటారు. ఎక్కడా తమకు మరక అంటకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏ మాత్రం తేడా జరిగినా సొంత వారు అని కూడా చూడరు. ఇప్పుడు రాజకుమారుడు ఆండ్రూ విషయంలో కూడా అదే అయింది. దివంగత రాణి ఎలిజిబెత్ రెండో కుమారుడు, చార్లెస్ తమ్ముడు ఆండ్రూ. ఎపిస్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన రాయల్‌ టైటిల్‌ ‘డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌’ను వదులుకున్నారు.  ఇప్పుడు రాజు చార్లెస్ కూడా తన తమ్ముడిపై యాక్షన్ తీసుకున్నారు.  ఆండ్రూ కు ఉన్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు. అంతే కాకుండా ఆండ్రూ ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్‌లోని విండ్సర్‌ ఎస్టేట్‌ను కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించారు.  దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రిగ్‌ హోమ్‌ ప్రైవేటు ఎస్టేట్‌లోకి మారతారని బకింగ్ హామ్ ఫ్యాలెస్ తెలిపింది. ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను చాలాసార్లు తిరస్కరించారు. అయినా కూడా రాజుగా చార్లెస్ తన విధులను నిర్వర్తించాలని భావించడం వల్లనే ఆండ్రూ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. రాజు చార్లెస్, రాణి కెమిల్లా కుంభకోణంలోని బాధితుల వైపే ఉంటారని బకింగ్ హామ్ స్పష్టం చేసింది.

Also Read:  Central Government: అమెరికా నుంచి 2790 మంది భారతీయుల బహిష్కరణ..కేంద్రం వెల్లడి

Advertisment
తాజా కథనాలు