/rtv/media/media_files/2025/01/22/go7yzJfLQ1qLCULdhJXL.jpg)
Trump
అక్రమ వలసదారులను వెనక్కి పంపించేందుకు అమెరికా భారీ బహిష్కరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని పై తాజాగా పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. అక్రమంగా ఉన్నారనే కారణంతో వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించినట్లే అవుతుందన్నారు.
Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే
అమెరికా బిషప్ లకు లేఖ రాసిన పోప్ వలసదారుల అణచివేతకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాదని పేర్కొన్నారు.
రక్షణ కల్పించాలన్నారు...
నేరస్థుల నుంచి తమ ప్రజలను రక్షించుకునే హక్కు ఆ దేశాలకు ఉందని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అయితే తీవ్ర పేదరికం, హింస,అభద్రత,దాడులు,వాతావరణం విపత్తుల కారణంగా సరిహద్దులు దాటి వచ్చే వారిని మాత్రం స్వాగతించాలని ,వారికి రక్షణ కల్పించాలన్నారు. ఇందుకోసం తమ సామర్థ్యాలు మేరకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అయితే అమెరికాలో కొనసాగుతున్న ఆపరేషన్ పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పిన పోప్..అది సరైన ఫలితం ఇవ్వదని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ..దాదాపు 8 వేల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.వీరిలో కొందరిని వెనక్కి పంపించగా..మరికొందరు జైళ్లలో, ఇంకొందరు నిర్బంధ కేంద్రాల్లో ఉన్నట్లు తెలిపింది.