White House Shooting: వైట్ హౌస్ కాల్పులు.. ఈ 5 దేశాల పౌరులు అమెరికాలోకి నో ఎంట్రీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో 5 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశం నిషేధించారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా దేశాలు.

New Update
Trump

Trump

అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు(White House shooting) జరిపిన ఘటన నేపథ్యంలో, దేశ భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా మరిన్ని దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విస్తరించింది. మరో ఐదు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధం విధిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా ఈ దేశాల నుంచి వలస లేదా పర్యాటక వీసాల జారీపై పూర్తి నిషేధం అమలులోకి రానుంది.

Also Read :  బీబీసీకి బిగ్‌ షాక్.. ట్రంప్ పరువు నష్టం దావా.. రూ.90 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్

US Expands Travel Ban To Five More Countries

Also Read :  భారీగా H-1B, H-4 వీసాలు ‘రద్దు’..ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్

వీటితో పాటు, మరో 15 దేశాల పౌరుల ప్రవేశ నిబంధనలను కూడా అమెరికా కఠినతరం చేసింది. ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేసే విషయంలో భద్రతా తనిఖీలను మరింత పక్కాగా అమలు చేయనున్నారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నవారిపై కూడా పూర్తిస్థాయి ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ, అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రతనే ప్రధానమని స్పష్టం చేసింది. నిషేధం విధించిన దేశాల్లో "అవినీతి, నకిలీ పౌర పత్రాలు, నేర చరిత్ర" వంటి సమస్యలు ఉన్నందున, వారిని అమెరిగ్గా వచ్చే ముందు పూర్తిస్థాయిలో పరిశీలించడం కష్టమని పేర్కొంది. అలాగే, కొన్ని దేశాల నుంచి వచ్చే పౌరులు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోవడం, తిరిగి తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.

వైట్‌హౌస్ సమీప కాల్పుల ఘటనతో అప్రమత్తమైన ట్రంప్ సర్కార్, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే ఏ విదేశీయుడినీ అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే కొన్ని దేశాలపై అమలులో ఉన్న ప్రయాణ నిషేధాన్ని ఈ విస్తరణ మరింత కఠినతరం చేసింది.

Advertisment
తాజా కథనాలు