Hydraa Video: కేబుల్ బ్రిడ్జిపై ఆత్మహత్యకు యత్నం.. లైవ్ లో కాపాడిన హైడ్రా!

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించిన రామిరెడ్డి అనే వ్యక్తిని హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. ఇంట్లో గొడవలు కారణంగానే అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. 

New Update
DRF

హైదరాబాద్ కు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి నుంచి దుర్గం చెరువులోకి అతను దూకడానికి ప్రయత్నించాడు. కేబుల్ బ్రిడ్జి పై వరద నీరు పోవడానికి హోల్స్ క్లిన్ చేస్తున్న హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది రామిరెడ్డి ఆత్మహత్యం చేసుకోవడం గమనించింది. వెంటనే  డిఅర్ఎఫ్ సిబ్బంది చాకచక్యంగా అతన్ని కాపాడి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.

మద్యానికి బానిస..ఇంట్లో గొడవలు..

రామిరెడ్డి వయసు 25 ఏళ్ళు. ఇతనికి పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. అయితే ఇతను మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఇదే కారణంతో రామిరెడ్డి భార్య, కూతురుని తీసుకుని రామిరెడ్డిని వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం రామిరెడ్డిని అతని సోదరికి అప్పగించారు. దాంతో పాటూ అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు