Modi-Putin: బలపడుతున్న భారత్‌-రష్యా బంధం.. పుతిన్‌కు మోదీ ఫోన్

భారత్‌-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం.

New Update
PM Modi speaks to Russia President Putin days after Trump’s ‘oil tariffs’,

PM Modi speaks to Russia President Putin days after Trump’s ‘oil tariffs’,

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం టారిఫ్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడతున్నాయి. మరోవైపు భారత్‌-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం. అయితే ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ముగించేందుకు శాంతియుత చర్చలే పరిష్కారమని భారత్‌ మరోసారి చెప్పినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.  

Also read: ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ వార్నింగ్.. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

అలాగే భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన మోదీ, పుతిన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మోదీ, పుతిన్‌ నిబద్ధతను చాటారని సమాచారం. మరోవైపు 23వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివర్లో పుతిన్‌ భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు PMO కార్యాలయం పేర్కొంది.  రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ట్రంప్‌ టారిఫ్‌ను 50 శాతానికి పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మరో ఏడాది అవకాశం

మరోవైపు భారత్‌కు రష్యా భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. చమురును మరింత చౌకగా అమ్మేందుకు సిద్ధమవుతోంది. డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ కేపీఎల్‌ఈఆర్‌ లిమిటెడ్‌ ఈ విషయాన్ని తెలిపింది. డేటెడ్‌ బ్రెంట్‌ చమురు కంటే ఉరల్స్‌ గ్రేడ్‌ క్రూడ్‌ ఐదు డాలర్లు చౌకగా ఉందని పేర్కొంది. అయితే రెండు వారాల క్రితం ఇవి రెండు ధరలు ఒకే రకంగా ఉండేవి. ఉరల్స్ చమురు ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !

అమెరికా, భారత్‌ టారిఫ్‌ వివాదం నెలకొన్న వేళ.. ప్రధాని మోదీ చైనా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 30న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముందుగా జపాన్‌లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరుకానున్నారు.ఈ విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్ స్పందించారు. SCO దేశాలతో సహా 20 దేశాధినేతలు అలాగే 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు షాంఘై సదస్సులో పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2020లో గల్వాన్‌ లోయలో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దెబ్బపడింది. 2019 తర్వాత  చైనాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. 

Advertisment
తాజా కథనాలు