/rtv/media/media_files/2025/08/06/riaz-hamidullah-2025-08-06-10-42-56.jpg)
Riaz Hamidullah
భారత్, బంగ్లాదేశ్..పొరుగు దేశాలు. పాకిస్తాన్ లానే బంగ్లా కూడా దాయాది దేశం. దేశాలు విడిపోయినా ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ సంబంధానికి బీటలు పడ్డాయి. బంగ్లాదేశ్ లో రాజకీయ మార్పులే దీనికి కారణం. ఆ దేశానికి ప్రధానిగా షే్ హసీనా ఉన్నంత వరకు భారత్ తో అద్భుతమై దోస్తీ ఉంది. కానీ ఎప్పుడైతే ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టారో, ఆమె ఇండియా వచ్చి తల దాచుకుందో..అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ భారత్ పై కత్తి కట్టింది. మొహ్మద్ యూనస్ సారధ్యంలో భారత్ పై తిరుగుబాటు మొదలైంది. అక్కడ హిందువులపై దాడులు చేశారు. భారత్ కు సంబంధించిన చరిత్ర ఆనవాళ్లను కూలగొట్టారు. ఇంకా చాలా చేశారు. అంతేకాదు మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చేతులు కలపడానికి బంగ్లాదేశ్ ప్రయత్నించింది. అక్కడి నేతలతో తరుచూ సంప్రదింపులు జరుపుతూ, వారి దేశాలకు పర్యటనకు వెళుతూ..భారత్ పై అవాకులు, చవాకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ చాలానే చేసింది. దీంతో పాక్, చైనాలు రెండూ బంగ్లాదేశ్...భారత్ కు వ్యతిరేకం అని ఫిక్స్ అయిపోయాయి.
మా అనుబంధం విడదీయలేనిది..
అయితే ఇప్పుడు తాజాగా ఆ రెండు దేశాలకు బంగ్లా చెక్ పెట్టింది. పాకిస్తాన్, చైనా ఆశను వమ్ము చేస్తూ పెద్ద ప్రకటన చేసింది. భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ భూమిని వాడుకోవడానికి ఎప్పటికీ ఒప్పుకోమని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఈ విషయాన్ని ప్రకటించారు. భార, బంగ్లాల మధ్య సంబంధాలు దశాబ్దాల నాటివని..అవి నమ్మకం, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, సాంస్కృతిక పునాదులపై నిర్మించబడ్డాయని హమీదుల్లా స్పష్టం చేశారు. రెండు దేశాలకు మప్పు వాటిల్లే పని ఎప్పటికీ చేయమని చెప్పారు. పాకిస్తాన్ లేదా చైనాతో బంగ్లాదేశ్ ప్రవర్తన సైద్ధాంతిక మార్పుకు సంకేతమనే భావనను ఆయన తిరస్కరించారు. మైనారిటీలు, హిందువుల మీద జరిగిన దాడులను బట్టి మొత్తం బంగ్లాదేశ్ ను నిర్వచించలేరని హమీదుల్లా అన్నారు.
ఆర్ధిక సంబంధాలు మాత్రమే..
మరోవైపు చైనాతో తమ దేశం సంబంధాలు పెంపుకు కూడా హమీదుల్లా క్లారిటీ ఇచ్చారు. తమ రెండు దేశాల మధ్యనా ఉన్నది ఆర్థిక సంబంధమేనని చెప్పారు. కానీ సాంస్కృతికగా రెండూ భిన్నమైన దేశాలని...వారితో ఎప్పటికీ కలవలేమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ దిగుమతులపై ఆధారపడిన దేశం అని ఆయన అన్నారు. అందువల్ల, బంగ్లాదేశ్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
Also Read: Trump: నాకేం తెలియదు..నేనలా అనలేదు..ట్రంప్ రెండు నాలుకలు