/rtv/media/media_files/2025/04/12/6DZW1A73zt8uF7cDelda.jpg)
Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్ పటేల్ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్ ఆర్య (36) నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!
కింగ్స్ ప్లేయర్ రన్స్
దీంతో పంజాబ్ జట్టు 4 ఓవర్లకు స్కోర్ 66/1 చేసింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సహాన్ని తెప్పించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు.
చితక్కొట్టిన శ్రేయస్
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఇప్పటికే ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ అయిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో లక్నో జట్టు ఘన విజయం సాధించింది. రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
మొదట ఓపెనర్లు క్రీజ్‌లోకి దిగిన నుంచి దూకుడుగా ఆడారు. స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. వారు అయిపోయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేస్తున్నాడు. వరుసగా ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు. అతి తక్కువ బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
అతడు ఆచితూచి ఆడటమే కాకుండా.. కొట్టాల్సిన దగ్గర భారీ షాట్లు కొట్టి పరగులు రాబట్టాడు. 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేశాడు. ఇక సెంచరీకి మరికొన్ని పరుగులే అవసరం. ఈ లోపే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (82) ఔట్ అయ్యాడు. కేవలం 36 బంతుల్లో ఈ పరుగులు సాధించి.. సెంచరీకి చేరువలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతడు 100 పరుగులు చేస్తాడని ఆశించిన అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి.