Plane Crash: అయ్యో ఘోరం ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన విమానం (వీడియో)

హాంకాంగ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఎమిరేట్స్ స్కైకార్గో విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి జారి సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో విమానం గ్రౌండ్ వెహికల్‌ను ఢీకొట్టింది. దీంతో గ్రౌండ్ వెహికల్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం.

New Update
Emirates SkyCargo flight EK9788

Emirates SkyCargo flight EK9788

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియాలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదాలు(aeroplane crashes) ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైనదని భావించినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు ప్రజలలో నమ్మకాన్ని కదిలించాయి. గతంలో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. బ్లాక్‌బాక్స్ దెబ్బతినడం, జీపీఎస్ స్పూఫింగ్ వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ భయంకరమైన ఘటన నేపథ్యంలో హాంగ్ కాంగ్‌లో తాజాగా జరిగిన మరో విమాన ప్రమాదం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Also Read :  అయ్యో ఘోరం ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన విమానం

Hong Kong Plane Skid From Runway

దుబాయ్ నుంచి వచ్చిన బోయింగ్ 747 కార్గో విమానం (Emirates SkyCargo flight EK9788) హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport)లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది. ఈ భయంకరమైన ప్రమాదంలో విమానాశ్రయం గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించారు.

సోమవారం తెల్లవారుజామున సుమారు 3:53 గంటలకు ఈ ఘటన జరిగింది. టర్కిష్ క్యారియర్ ఎయిర్ ఏసీటీ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఎమిరేట్స్ స్కైకార్గో విమానం దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Al Maktoum International Airport) నుంచి బయలుదేరింది. ఉత్తర రన్‌వే 07R పై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అకస్మాత్తుగా ఎడమ వైపుకు తిరిగి.. వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి, రన్‌వే పక్కన ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత విమానం ముందు భాగం సముద్రపు గోడను దాటి నీటిలోకి జారి మునిగిపోయింది.

Also Read :  అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురికి గాయాలు

కాగా ఈ ప్రమాద సమయంలో విమానం గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో గ్రౌండ్ వాహనం చక్రం ఊడిపోయింది. ఆ వాహనంలో ఉన్న ఇద్దరు విమానాశ్రయ ఉద్యోగులు గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత వారిని రెస్క్యూ సిబ్బంది గుర్తించినప్పటికీ.. అప్పటికే ఒక 30 ఏళ్ల వ్యక్తి సంఘటనా స్థలంలోనే మరణించగా, 41 ఏళ్ల మరో ఉద్యోగిని నార్త్ లాంటౌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కూడా తుది శ్వాస విడిచినట్లు పోలీసులు ప్రకటించారు.

మరోవైపు విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది (కార్గో విమానం కావడంతో ప్రయాణికులు లేరు) సురక్షితంగా బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఉత్తర రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విమానం ట్రాకింగ్ డేటా ప్రకారం, ల్యాండింగ్ సమయంలో విమానం దిశ అకస్మాత్తుగా మారినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రన్‌వే నుంచి శిథిలాలను తొలగించి, భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఉత్తర రన్‌వే మూసివేయబడుతుందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన కారణంగా, అదే రన్‌వేపై ల్యాండ్ కావాల్సిన మరో ప్యాసింజర్ విమానం (క్యాథే పసిఫిక్ ఫ్లైట్ CX851) తన ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని దక్షిణ రన్‌వేకు మళ్లించాల్సి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు