BIG BREAKING : అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ (OSU)లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున యూనివర్సిటీలోని రెసిడెన్స్ హాల్ వద్ద జరిగిన ఈ దాడిలో ఒక విద్యార్థితో సహా కనీసం ముగ్గురికి గాయాలయ్యాయి.

New Update
us shooting

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ (OSU)లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున యూనివర్సిటీలోని రెసిడెన్స్ హాల్ వద్ద జరిగిన ఈ దాడిలో ఒక విద్యార్థితో సహా కనీసం ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు OSU విద్యార్థి అని యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. క్యాంపస్ వెలుపల జరిగిన ఒక పెద్ద ప్రైవేట్ పార్టీ నుండి కొంతమంది విద్యార్థులు రెసిడెన్స్ హాల్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. : ప్రస్తుతం క్యాంపస్‌లో ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి అదుపులో ఉందని యూనివర్సిటీ పోలీస్ చీఫ్ మైఖేల్ బెక్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హాల్‌లో నివసించే వారు కాని ఇతరులెవరూ ఆ ప్రాంతానికి రాకుండా ఉండాలని యూనివర్సిటీ అధికారులు కోరారు.

Advertisment
తాజా కథనాలు