India-Philippines: చైనాకు చెక్.. అదిరిపోయే స్కెచ్ వేసిన భారత్!

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ ఆర్‌ మార్కోస్ సోమవారం భారత్‌కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది

New Update
Philippines President Marcos in India for 5-day visi

Philippines President Marcos in India for 5-day visi

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేఫథ్యంలో భారత్‌, ఫిలిప్పీన్స్‌ మధ్య సంబంధాలు మెరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ, ఆర్థిక సహకారంలో పురోగతి కనిపిస్తోంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ ఆర్‌ మార్కోస్ సోమవారం భారత్‌కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఆయన పర్యటన భారత్‌, ఫిలిప్పీన్స్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల మధ్య జరగడం మరో విశేషం. మార్కోస్ పర్యటన చైనాకు చెక్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్-ఫిలిప్పీన్స్‌ మధ్య ఎలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Also Read: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్‌.. ఆసక్తి చూపుతున్న భారతీయులు

భారత్-ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949లో నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇరుదేశాలు పెట్టుబడులు, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, వాణిజ్యం. ఫార్మాస్యూటికల్స్, హెల్త్, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. అలాగే ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN)తో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఫిలిప్పీన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. మహాసాగర్ విజన్, యాక్ట్ ఈస్ట్‌ పాలసీ, అలాగే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఫిలిప్పీన్స్‌తో సంబంధాలు ఓ కీలక స్తంభంగా నిలిచినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.  

అయితే మార్కస్‌ పర్యటనలో ముఖ్యంగా ఇరుదేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో సహకారం అందించడంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫిలిప్పీన్స్‌ తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ద--ృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత్‌ నుంచి ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ క్షిపణులను కూడా కొనుగోలు చేసింది. ఇండియన్ నావీకి చెందిన INS మైసూర్, INS కిల్తాన్, INS శక్తి వంటి యుద్ధనౌకలు ఇటీవల ఫిలిప్పీన్స్‌లో పర్యటించాయి. 

Also Read: 'నిజమైన భారతీయులు అలా మాట్లాడరు'.. రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఫైర్

మరోవైపు భారత్-ఫిలిప్పీన్స్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.53 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇండియా నుంచి ముఖ్యంగా ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఔషధాలు, ఉక్కు, బియ్యం, మాంసం లాంటివి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఫిలిప్పీన్స్‌ నుంచి సెమీకండక్టర్లు, సీసం, రాగి, ఎలక్ట్రికల్ మెషినరీ, ప్లాస్టిక్స్‌ వంటివి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. మరోవిషయం ఏంటటే ఇటీవల ఫిలిప్పీన్స్‌ భారత పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది. దీంతో భారత టూరిస్టుల సంఖ్య ఆ దేశంలో 28 శాతం పెరిగింది.  

మొత్తానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ పర్యటన ఇరుదేశాల మధ్య ఓ కీలక ఘట్టంగా నిలిచిపోనుంది. ఈ పర్యటన అనేది కేవలం ద్వైపాక్షిక సంబంధాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చైనాకు కూడా చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. 

Also read: ముంచుకొచ్చిన భారీ వరదలు.. 252 మృతి చెందగా.. 3 వేల మందికి పైగా..!

Advertisment
తాజా కథనాలు