Heavy Rains: ముంచుకొచ్చిన భారీ వరదలు.. 252 మృతి చెందగా.. 3 వేల మందికి పైగా..!

గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు 252 మంది ఇప్పటి వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఎన్నో జంతువులు కూడా ఆ వరదల్లో కొట్టుకొనిపోయాయి. మూడు వేలకు మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు.

New Update
Madhya pradesh rains

Madhya pradesh rains

గత కొన్ని రోజుల నుంచి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్, యూపీలో భారీ వర్షాలకు వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారి ఇళ్లు అయితే వరదలతో నిండిపోయాయి. వెంటనే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో కాస్త విముక్తి కలిగింది. 

ఇది కూడా చూడండి:Weather Update: మరో 6 రోజులు కుమ్ముడే కుమ్ముడు.. భారీ వర్షం, తుఫాను గాలుల హెచ్చరిక!

దాదాపుగా 252 మంది మృతి చెందినట్లు..

గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు 252 మంది ఇప్పటి వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఎన్నో జంతువులు కూడా ఆ వరదల్లో కొట్టుకొనిపోయాయి. మూడు వేలకు మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని సహాయ శిబిరాలకు పంపించారు. వారికి అవసరమైన వాటిని అందిస్తున్నారు. భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ధార్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ప్రజలను ఎన్డీఆర్‌ఫ్ బృందాలు కాపాడుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Weather Update: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు!

ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరికలు..

ఇదిలా ఉండగా ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఢిల్లీలో ఉత్తర, దక్షిణతో పాటు బిహార్‌లోని గయ, పూర్తియా, పాట్నా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, నవాడ, ముజఫర్‌పూర్, సివాన్, భాగల్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే రాజస్థాన్‌లో బుండి, అల్వార్, దౌసా, సవాయి, మాధోపూర్, కరౌలి, బరాన్, కోటలో వస్తాయి. మధ్యప్రదేశ్‌లో శివపురి, మోరెనా, విదిష, అశోక్‌నగర్, సాగర్, భిండ్, సెహోర్, హోషంగాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

Advertisment
తాజా కథనాలు