Turkey: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు

టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది.  6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి.  మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.

New Update
trukey

పశ్చిమ టర్కీలో సిందిర్గి, బలికేసిర్ సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 6.0 తీవ్రతతో భూమి కంపించింది. సిందిర్గికి ఆగ్నేయంగా 8 కి.మీ దూరంలో 10.0 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. అర్థరాత్రి 1.18 నుంచి 5.30 మధ్యలో జరిగిందని చెబుతున్నారు. ఇజ్మీర్, ఇస్తాంబుల్, బుర్సా, పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు విస్తృతంగా వచ్చాయని తెలుస్తోంది.  దీని కారణంగా  ఇస్తాంబుల్, సిందిర్గి పట్టణాలలో భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే దీని కారణంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు ఇదే సిందిర్గిలో భూకంపం వచ్చి ఒకరు మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారు. 

14 సార్లు కంపించిన భూమి..

టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ (AFAD) భూకంపం 5.99 కి.మీ (3.72 మైళ్ళు) లోతులో సంభవించిందని చెబుతోంది. టర్కీతో పాటూ మనిసాలో కూడా భూమి కంపించిందని తెలిపింది. ఈ రోజు, రేపు కూడా భూకంపం రావచ్చని ఎఫ్ఏడీ అంచనా వేస్తోంది. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా వుండాలని చెబుతున్నారు.  ఇప్పటి వరకు బలికేసర్ లో 14 సార్లు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు.  టర్కీ ప్రధాన ఫాల్ట్ లైన్ల పైన ఉండటం వల్ల తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 2023లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి దక్షిణ, ఆగ్నేయ ప్రావిన్సులలో 53,000 మందికి పైగా మరణించగా..వేలకొద్దీ ఇళ్ళు, భవనాలు నేలమట్టం అయ్యాయి. 

Also Read: President Trump: మూడో టర్మ్ లోనూ ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు..

Advertisment
తాజా కథనాలు