Delhi: నవంబర్ 1 నుంచి.. ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నవంబర్ 1 నుండి ఢిల్లీలో రిజిస్టరైన, 'BS- 6' ఉద్గార ప్రమాణాలకు లోబడి లేని కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

New Update
Commercial vehicles

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నవంబర్ 1 నుండి ఢిల్లీలో రిజిస్టరైన, 'BS- 6' ఉద్గార ప్రమాణాలకు లోబడి లేని కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీలో ప్రతి సంవత్సరం శీతాకాలం సమీపించే కొద్దీ గాలి నాణ్యత గణనీయంగా పడిపోతుంది. వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు, ముఖ్యంగా పాత డీజిల్ ట్రక్కుల కాలుష్యం దీనికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ అలాగే దాని పరిసర ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చే ఈ నిషేధం కేవలం ఢిల్లీలో రిజిస్టర్ అయిన, BS-VI ప్రమాణాలు పాటించని వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, కొన్ని రకాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు:

ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలు.
BS-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న డీజిల్ వాహనాలు.
CNG, LNG గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ నడిచే ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు.

BS-IV వాహనాలకు తాత్కాలిక ఉపశమనం తాత్కాలిక చర్యగా, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన BS-IV ప్రమాణాలకు లోబడి ఉన్న వాణిజ్య సరుకు రవాణా వాహనాలను అక్టోబర్ 31, 2026 వరకు ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ గడువు తర్వాత అవి కూడా పూర్తిగా నిషేధానికి లోబడి ఉంటాయి. పాత వాహనాలను మార్చుకోవడానికి లేదా BS-VI ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఈ సమయాన్ని ఇచ్చారు.

CAQM ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడానికి సరిహద్దుల్లో తనిఖీలను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ చర్యతో ఢిల్లీలోని గాలి నాణ్యత మెరుగుపడుతుందని, ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు