India-Pakistan: భారత్‌ యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.

New Update
Pakistan President Zardari claims India preparing for another war

Pakistan President Zardari claims India preparing for another war

పాకిస్థాన్(pakistan) అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ(Asif Ali Zardari) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆపరేషన్ సిందూర్‌(operation Sindoor) సమయంలో భారత్‌ తమపై దాడులు చేస్తుంటే తనని బంకర్‌లో దాక్కోవాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఇందుకు తాను ఒప్పకోలేదన్నారు. ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.  

ఈ సందర్భంగా జర్దారీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి హైడ్రో టెర్రరిజానికి పాల్పడిందని నోరు పారేసుకున్నారు. రాజకీయానికి నీటి ప్రవాహాలను ముడిపెట్టి ఆయుధంగా వాడటం సమంజసం కాదని అన్నారు. అందుకే భారత్ మరో యుద్ధానికి రెడీ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. తాము మాత్రం శాంతి, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదని.. భారత్‌తో చర్చలు జరిపేందుకు పాక్ రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు.  

Also Read: హర్మూజ్ జలసంధి మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం

India Preparing For Another War

జర్దారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్‌ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు సింధూ జలాల ఒప్పందాన్ని నిలివేసింది. సరిహద్దును మూసివేసింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి.

మరోవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌లో అమెరికన్‌ ఎంబసీపై అక్కడి స్థానికులు దాడులు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. మరోవైపు భారత్‌లో కూడా జమ్మూకశ్మీర్‌, హైదరాబాద్‌లో కూడా షియా ముస్లింలు ఆందోళనలు చేపట్టడం కలకలం రేపింది.  

Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్‌లో చిక్కుకున్న 5 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్

Advertisment
తాజా కథనాలు