/rtv/media/media_files/2026/03/03/over-5-lakh-indian-students-stranded-in-west-asia-2026-03-03-08-05-35.jpg)
Over 5 Lakh Indian students Stranded In West Asia
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు(iran israel war) చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావణం నెలకొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. వాళ్ల చదువులకు ఆటంకం ఏర్పడటమే కాకా భద్రతాపరంగా ముప్పును ఎదుర్కొంటున్నారు. 2025 నాటి గణాంకాల ప్రకారం 150 దేశాల్లోని యూనివర్సిటీలు, స్కూళ్లలో మొత్తంగా 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.
Also Read: జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు
Indian Students Stranded In West Asia
వీళ్లలో పశ్చిమాసియాలోనే దాదాపు 5 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్(indian-students) ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. దీంతో ఇక్కడ భారతీయులకు అనుగుణంగా ఉండే సిలబస్‌నే బోధిస్తారు. అందుకే భారతీయ విద్యార్థులు ఇక్కడ చదవుకునేందుకు ప్రాధాన్యం చూపిస్తారు. - iran us war
Also Read: గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ
కేంద్ర గణాంకాల ప్రకారం చూసుకుంటే UAEలో అత్యధికంగా 2,53,832 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా (75,830), కువైట్(50,000), ఖతార్(49,346), ఒమన్ (44,847), బహ్రెయిన్ (28,620), ఇజ్రాయెల్(900) దేశాలు ఉన్నాయి. దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఈ దేశాల్లో చదువుకుంటున్నారు. అక్కడ మార్చి 2న 10వ తరగతి, 12వ తరగతి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జరగాల్సి ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాటిని కూడా వాయిదా వేశారు. మరోవైపు ఉపాధి కోసం పశ్చిమాసియాకు వచ్చిన భారతీయుల సంఖ్య దాదాపు 80 లక్షలు ఉంటుంది.
Follow Us