/rtv/media/media_files/2026/03/03/iran-says-will-attack-any-ship-trying-to-pass-through-strait-of-hormuz-2026-03-03-09-44-53.jpg)
Iran says will attack any ship trying to pass through Strait of Hormuz
పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా(us iran war), ఇజ్రాయెల్(israel) దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని వార్నింగ్ ఇచ్చింది.
Also Read: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత.. యుద్ధంలోకి చైనా ఎంట్రీ
Iran Says Will Attack Any Ship
హర్ముజ్(Hormuz) జలసంధి అనేది ప్రపంచ ఇంధన రవాణాకు కీలక మార్గంగా ఉంది. ఈ మార్గం నుంచే ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతోంది. భారత్‌కు కూడా ఇక్కడి నుంచే 50 శాతం చమురు దిగుమతి అవుతోంది. ఇలాంటి కీలమైన జలసంధిని మూసివేయడం వల్ల రవాణా, బీమా ఖర్చులు పెరుగుతాయి. దీంతో చమురు ధరలు ఆమాంతం పెరిగిపోతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ఈ ప్రభావం కనిపిస్తోంది.
Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్‌లో చిక్కుకున్న 5 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్
ఇదిలాఉండగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు, 40 మందికి పైగా ఇతర సీనియర్ నేతలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై, దౌత్య కార్యాలయాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.
Follow Us