Helicaptor: కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్డర్.. ఐదుగురు మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్‌లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Pakistan govt helicopter crashes in Gilgit-Baltistan region

Pakistan govt helicopter crashes in Gilgit-Baltistan region

పాకిస్థాన్‌(Pakistan) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్‌లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్‌ కుప్పకూలింది(helicaptor-crash). ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పర్యాటక ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన హెలిప్యాడ్‌పై టెస్ట్ ల్యాంగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నిషియన్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Also Read: త్వరలో వాయుసేన చేతికి మరో ఆయుధం..అమ్ముల పొదిలో తేజస్‌ మార్క్‌-1ఏ

Pakistan Helicaptor Crashes In Gilgit-Baltistan Region

ఇదిలాఉండగా ఖైబర్‌ పంఖ్తువా ప్రావిన్స్‌లో ఇటీవల మరో ప్రభుత్వ MI-17 హెలికాప్టర్‌ కుప్పకూలింది. వరద బాధితులకు సహాయం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్నిరోజులకే తాజాగా మరో ప్రభుత్వ MI-17 హెలికాప్టర్ కుప్పకూలడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!

Advertisment
తాజా కథనాలు