China vs Taiwan: తైవాన్‌లోకి చైనా ఆర్మీ విమానాలు.. మరో యుద్ధం రాబోతుందా..?

చైనా ఆర్మీ విమానాలు, నౌకలు తైవాన్ దేశ సరిహద్దులోనికి ప్రేవేశించినట్లు ఆ రక్షణ శాఖ వెల్లడించింది. ఆ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. చైనా ఆర్మీ విమానాలకు, యుద్ధ నౌకలకు ఎదుగురుగా తైవాన్ బలగాలను మోహరించింది.

New Update
chinese military activity

chinese military activity

ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితి కనబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుండగా.. చైనా తైవాన్ ఆక్రమనకు చర్యలు ముమ్మరం చేసింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ (ఆగస్టు 19) మంగళవారం తన భూభాగం సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలను గుర్తించినట్లు తెలిపింది. చైనాకు చెందిన 10 ఆర్మీ విమానాలు, ఆరు నావికాదళ నౌకల కార్యకలాపాలను చూసినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.10 విమానాలలో 2తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఉత్తర ఎయిర్ డిఫెన్స్ గుర్తింపు జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయి. తైవాన్ సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలించింది. దీనికి ప్రతిస్పందనగా తైవాన్ విమానాలు, నావికాదళ నౌకలు, తీర ఆధారిత క్షిపణి వ్యవస్థలను చైనా సైనిక విమానాల వైపు మోహరించింది. ఆ క్రమంలో తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ X లో ఓ పోస్ట్ చేసింది.

తైవాన్‌పై చైనా సైనిక నిఘా

తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఇలా రాసింది, మంగళవారం (ఆగస్టు 19) ఉదయం 6 గంటల నాటికి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన 10 విమానాలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN)కి చెందిన 6 నౌకలు తైవాన్ చుట్టూ కనిపించాయి. వీటిలో 2 విమానాలు మధ్యస్థ రేఖను దాటి ఉత్తర ADIZలోకి ప్రవేశించాయి. మేము పరిస్థితిని పర్యవేక్షించాము. అవసరమైన విధంగా స్పందించాము." చైనా ఇలా చేయడం తైవాన్ గతంలో చాలాసార్లు గుర్తించింది. ఆగస్టు 18న కూడా 6 చైనా సైనిక విమానాలు, 5 యుద్ధ నౌకల కార్యకలాపాలను తైవాన్ నమోదు చేసింది. వాటిలో 3 విమానాలు మధ్యస్థ రేఖను దాటి ఉత్తర ADIZలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, ఆదివారం చైనా ఆర్మీకి చెందిన 6 విమానాలు, 5  నౌకలు తైవాన్‌కు చెందిన MND చుట్టూ యాక్టీవ్‌గా ఉన్నాయని తెలిపింది. వీటిలో 2 విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ ఉత్తర, నైరుతి ADIZలోకి ప్రవేశించాయి.

తైవాన్‌ను తన భాగమని చైనా చెబుతోంది

చైనా తన "వన్ చైనా" సూత్రం ప్రకారం తైవాన్‌ను తన భూభాగంలో భాగమని పేర్కొంటూనే ఉంది. దానిని బీజింగ్‌తో తిరిగి కలపాలని పట్టుబడుతోంది. మరోవైపు, తైవాన్ విస్తృత ప్రజా మద్దతుతో తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ద్వారా చైనా చొరబాట్లకు ప్రతిస్పందిస్తోంది.

Advertisment
తాజా కథనాలు