Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!

భారత్‌తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్‌లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.

New Update
pakistan separatist movement

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం రాబోతోందా? ఒకవైపు ఇండియాతో యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమవుతుంటే ఇదే అదనుగా ఆ దేశంలో ఉన్న ఏర్పాటు వాద సంస్థలు అంతర్యుద్ధానికి దిగుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక దేశం కోరుకుంటున్న బలుచిస్తాన్‌లో అక్కడి ఉద్యమకారులు పాకిస్తాన్‌పై తిరుగుబాటు ప్రారంభించారు. శుక్రవారం పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్న వెహికల్‌ని రిమోట్ బాంబులతో పేల్చేసి నలుగురు సైనికుల్ని  చంపేసింది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.  ఖైబర్ ఫక్తున్ క్వా,  బలోచిస్తాన్ ప్రాంతాల్లో తహరి తాలిబాన్ తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP,  బలుచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ సైన్యంపై ఇదే అదనుగా విరుచుకుపడుతున్నాయి. 

Also read: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Pakistan Faces Threat

TTP పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ లోనూ ఖైబర్ ఫక్వాలను తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ సర్కార్ సహాయంతో ఈ సంస్థ భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని సమకూర్చుకొని పాకిస్తాన్ ఆర్మీపై యుద్ధానికి దిగుతుంది. దీని దాడిని తట్టుకోవడానికి పాకిస్థాన్‌లో ఉన్న ట్రైబల్ ఏరియాలో ఫస్టన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతాల్ని ఆఫ్గనిస్తాన్‌లో కలపాలని TTP పాకిస్తాన్‌తో పోరాడుతోంది. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికే  దడుచుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతమంతా కూడా టీడీపీ చేతిలోకే వెళ్లిపోయింది. వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ నానా తంటాలు పడుతుంది. బిఎల్ఎఫ్, BLA ఇవి రెండు బలోచిస్తాను ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం ఈ రెండు సంస్థల ఆధీనంలోకి వెళిపోయింది.

Also read :  Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!

పాకిస్తాన్ తన సైన్యాన్ని ఎక్కువగా కాశ్మీర్ వైపు గురిపెట్టడంతో బలుచిస్తాన్, దాని చుట్టుపక్కల ఏరియాలపై ఈ ఉద్యమకారులు పట్టు బిగిస్తున్నారు. మరోవైపు ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కెపి కూడా పాకిస్తాన్ ఆర్మీతో దాడులకు దిగుతున్నాయి. పాకిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకోవటానికి ఈ రెండు సంస్థలు కూడా సైన్యం పై దాడులు చేస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం భారత్పై దృష్టి పెట్టడంతో ఆ దేశం నుంచి విడిపోయి ప్రత్యేక దేశం సాధించుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆ సంస్థలు భావిస్తున్నాయి యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి ప్రత్యేక దేశం ఏర్పాటుకు పోరాటాన్ని తీవ్రంచేశాయి దీంతో  పాకిస్తాన్ 3 ముక్కలయ్యే ప్రమాదం ఏర్పడింది. 1971 లో భారత్ తో జరిగిన యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలైంది. తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ గా అవతరించింది. భారతదేశం పైకి టెర్రరిస్టులను ఉసిగొలిపి మరోసారి యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఈసారి మూడు ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

Also Read :  ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

(pakistan | pakistan separatist movement | balochistan | terrorist | taliban | pakistan taliban | pakistan taliban ttp | pakistan taliban war | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు